పెళ్లి డ్రెస్సుతో ప్రయోగం చేసిన సమంత.. జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయిగా?

April 27, 2024

పెళ్లి డ్రెస్సుతో ప్రయోగం చేసిన సమంత.. జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయిగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి సమంత ప్రస్తుతం సినిమాలకు చిన్న విరామం ప్రకటించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏం మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం వరుస సినిమాలలో నటించారు. ఇలా హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈమె నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి సమంతా ఎంతో ఘనంగా తన పెళ్లిని జరుపుకున్నారు.

సుమారు ఆరేడు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దలను ఒప్పించి ఎంతో అంగరంగ వైభవంగా హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహాన్ని జరుపుకున్నారు. ఇక పెళ్లి తర్వాత సమంత నాగ చైతన్యల జీవితం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని చెప్పాలి. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయి కూడా దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ వీరి పెళ్లి విడాకులకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది అయితే తాజాగా సమంత సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే కనుక తన పెళ్లి జ్ఞాపకాలు చాలా పదిలంగా ఉన్నాయని తెలుస్తుంది.

పెళ్లి సమయంలో వైట్ కలర్ ఫ్రాక్ లో సమంత దేవకన్య లాగే కనిపించారని చెప్పాలి అయితే విడాకుల తర్వాత బహుశా ఈ గౌను అవసరం ఉండకపోవచ్చు అని భావించినటువంటి సమంత ప్రయోగం చేసి మరొక డిజైనర్ ఫ్రాక్ తయారు చేయించారు. ఈ గౌనులో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ తొలగించి మరొక గౌను కోసం ఈమె ఉపయోగించుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇలా సమంత సరికొత్త ఆలోచన విధానం ఎంతో బాగుంది అంటూ ఈ వీడియో పట్ల పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Read More: బాలకృష్ణకు సంస్కారం లేదు.. తిరిగి కొడితే ఏం చేస్తావ్.. పెద్ద సైకో: డైరెక్టర్ రవికుమార్

ట్రెండింగ్ వార్తలు