Family Star Movie Review Telugu: ది ఫ్యామిలీ స్టార్ రివ్యూ: సెంటిమెంట్సే లేని ఫ్యామిలీ స్టార్!

April 5, 2024

ది ఫ్యామిలీ స్టార్

ది ఫ్యామిలీ స్టార్

  • Cast : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్, జగపతిబాబు, వెన్నెల కిషోర్, అభినయ, ప్రభాస్ శ్రీను
  • Director : పరుశురాం
  • Producer : దిల్ రాజు
  • Banner : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
  • Music : గోపి సుందర్

2.25 / 5

నటుడు విజయ్ దేవరకొండ భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందు ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ నేడు విడుదలైంది. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించి సందడి చేశారు. మరి మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఈ సినిమాలో ఎలా నటించారో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారు అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..

కథ: ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు గోవర్ధన్ (విజయ్ దేవరకొండ) ఒక ఆర్కిటెక్ట్ ఇంజినీర్ చిన్నపాటి ఉద్యోగంతో తన కుటుంబ బండిని అదుపు పొదుపులతో పేరుకు తగ్గట్టుగానే కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. ఇలా ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఉన్నటువంటి గోవర్ధన్ ఇంటిపై అద్దెకి ఉండేందుకు ఓ అమ్మాయి ఇందు (మృణాల్ ఠాకూర్) వచ్చాక తన లైఫ్ ఎలా టర్న్ అవుతుంది? అసలు ఆమె తన జీవితం లోకి ఎందుకు వచ్చింది ఈ నేపథ్యంలో కి ఎదురైన సవాళ్లు ఏంటి? వాళ్ళు కలుస్తారా లేదా? అసలు ఈ ఇందు ఎవరు వీళ్ళ లైఫ్ ఎలా ముందుకు సాగింది అనేది సినిమా కథ.

విశ్లేషణ: ది ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక సీరియల్ ని సినిమాగా చేసి చూపించారని చెప్పాలి. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఇలాంటి సన్నివేశాలు ఇదివరకు చూసాము అనే భావన తప్పకుండా కలుగుతుంది అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను బాగా సాగదీసారు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం పరవాలేదు అనిపించింది. పరశురాం విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ సినిమాకు వెళ్తే ప్రేక్షకులకు నిరాశ తప్పదనే చెప్పాలి. ఇక విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఎంతో అద్భుతంగా నటించారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలైట్ అయ్యాయి.

నటీనటుల నటన: ఈ సినిమాలో హీరో హీరోయిన్లు విజయ్ మృణాల్ నటన అద్భుతమని చెప్పాలి వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. ఇక వాసుకి అభినయ వంటి సెలబ్రిటీలు నటించారు. అయితే వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తుంది. అయినప్పటికీ ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేశారు.

తీర్పు: ది ఫ్యామిలీ స్టొరీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో నటీనటుల నటన అద్భుతంగా ఉంది కానీ మనం ఎన్నో అంచనాల నడుమ థియేటర్ కి వెళ్తే నిరాశ తప్పదనే చెప్పాలి. ఈ సినిమా కథ కథనం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని చెప్పాలి.

Read More: ఇదే నా ఆఖరి సినిమా.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు