ఇదే నా ఆఖరి సినిమా.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్!

April 5, 2024

ఇదే నా ఆఖరి సినిమా.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్!

వెండితెర నటిగా ప్రస్తుతం వరుస భాషా చిత్రాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి మృణాల్ ఒకరు. ఈమె హీరోయిన్గా తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ మరాఠీ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. సీరియల్ నటిగా ప్రారంభమైనటువంటి తన ప్రయాణం ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు.

తాజాగా ఈమె విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నేడు థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. ఇక ఈ సినిమా నేడు విడుదల అవుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నాకు చిన్నప్పటి నుంచి ఒక మహారాణి పాత్రలో నటించాలి అనే కోరిక ఉండేది అయితే సీతారామం సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరిందని ఈమె తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర ఇలా ఉండబోతుంది అంటూ మేకర్స్ తన వద్దకు రావడంతో వెంటనే ఆలోచించకుండా ఈ సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు. అయితే ఈ పాత్రలో నటించడం కోసం తాను చాలా కష్టపడ్డానని ఈమె వెల్లడించారు.

ఈ సినిమా ఒకేసారి మూడు భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే తెలుగులో నాకు డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని ఈమె తెలిపారు. ఆ డైలాగ్స్ పలకడం రాలేదు వాటిని ఇంగ్లీష్ లోకి రాసుకొని చాలా కష్టపడ్డాను అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రతిరోజు తాను ఏడ్చానని ఇక ఒకరోజు దుల్కర్ సల్మాన్ తో మాట్లాడుతూ నాకు తెలుగు చాలా కష్టంగా ఉంది ఇదే నాకు తెలుగులో మొదటి ఆఖరి సినిమా అవుతుందని మృణాల్ తెలిపారట

ఈ మాటలు విన్నటువంటి దుల్కర్ నవ్వుతూ ఈ సినిమా తర్వాత నీకు తెలుగులో ఎక్కువగా అవకాశాలు వస్తాయని చెప్పారట ఆయన చెప్పిన విధంగానే ఈ సినిమా తర్వాత తెలుగులో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయని అయితే ఇప్పుడు తెలుగు మాట్లాడటం డబ్బింగ్ చెప్పడం తనకు చాలా ఈజీ అవుతుంది అంటూ ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: మొదలైన తండేల్ పోరాటం.. యాక్షన్ సీక్వెన్స్ లో నాగచైతన్య!

ట్రెండింగ్ వార్తలు