Gaami Movie Review: విశ్వక్ గామి సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

March 8, 2024

గామి

గామి

  • Cast : విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, మహమ్మద్ సమద్, హారిక పెడదా, శాంతి రావు, మయాంక్ పరాక్ మరియు ఇతరులు
  • Director : విద్యాధర్
  • Producer : శబరీష్
  • Banner : వి సెల్యులాయిడ్
  • Music : నరేష్ కుమార్ ఎన్

2.75 / 5

విశ్వక్ సేన్ హీరోగా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా ఈయన ఓ ప్రయోగాత్మక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విద్యాధర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈయన ఒక అఘోర పాత్రలో కనిపించారు. విశ్వక్ చాందిని చౌదరి జంటగా నటించిన ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందనే విషయానికి వస్తే..

కథ: శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోర పాత్రలో కనిపిస్తూ ఉంటారు. ఈయన ఎవరికీ తెలియని ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అయితే ఈయనని ఎవరైనా టచ్ చేస్తే చాలు వారు స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. దీంతో ఈయన వస్తున్నారంటే భయపడే వారు ఎక్కువగా ఉంటారు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉండడంతో శంకర్ ను ఆ ఆశ్రమం నుంచి బయటకు పంపించి వేస్తారు. ఇలా బయటకు పంపడంతో తనని ఆదరించిన గురువును కలవడం కోసం కాశీ వెళ్తారు. అయితే తన గురువుగారు మరణించారనే విషయాన్ని తన శిష్యులు చెప్పడంతో శంకర్ తనకు ఉన్న సమస్యను చెప్పగా ఆ సమస్యకు హిమాలయాలలో త్రివేణి పర్వతంలో 36ఏళ్లకి ప్రకాశించే మాలిపత్రి చెట్టులో ఉంటుందని చెబుతాడు. వైద్ర తిథి రోజున మాత్రమే మాలిపత్రి ప్రకాశిస్తుంది.

అది ప్రకాశం ఇచ్చే సమయంలో తీసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెబుతూ తనకు మ్యాప్ ఇస్తారు. ఆ మ్యాప్ ఆధారంగా శంకర్ హిమాలయాలకు వెళ్తారు .జాహ్నవి (చాందిని చౌదరి) కూడా కొన్ని వైద్యపరమైనటువంటి ప్రయోగాలకు ఆ మొక్కను ఉపయోగించాలని అతనితో కలిసి వెళుతుంది అయితే వీరు ఇద్దరు హిమాలయాలకు వెళ్లిన తర్వాత అక్కడ చెట్టును సొంతం చేసుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు మరి వీరిద్దరూ ఆ చెట్టును సొంతం చేసుకున్నారా.. ఎలా ఆ సమస్య నుంచి బయటపడ్డారు అన్నది ఈ సినిమా కథ.

విశ్లేషణ: ఈ సినిమాని ఒకసారి కొత్త ప్రయోగాత్మక చిత్రంగా దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే ఇలా అఘోరాలు, హిమాలయాలు వంటి వాటిని చూస్తే ఇలాంటి తరహా సినిమాలో ముందే చూసాము అన్న భావన కలుగుతుంది. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి కంటెంట్ ఉన్నప్పటికీ దానిని ప్రేక్షకులకు పరిచయం చేసే విషయంలో డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యారు. అంతేకాకుండా ప్రతి ఒక్క సన్నివేశంలో సస్పెన్స్ పెట్టడం అభిమానులకు ఒకానొక సమయంలో బోర్ కొట్టే విధంగా సినిమా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా కన్ఫ్యూజన్ కి గురిచేస్తుందని చెప్పాలి.

నటీనటుల నటన: శంకర్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ అదరగొట్టాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం సినిమాలో కనిపిస్తుంది. మాస్ హీరోగా కనిపించే విశ్వక్‌సేన్‌ని ఇలాంటి పాత్రలో చూడటం కూడా చాలా హార్డ్ గానే ఉంది అయితే ఈయన కష్టానికి డైలాగ్ డెలివరీకి పెద్దగా సింక్ కాలేదు. ఇక చాందిని చౌదరి కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఇలా ఈ సినిమాలో ప్రతి ఒక్కరు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

బాటమ్ లైన్: ఈ సినిమాలో ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్ ఉన్నప్పటికీ ఈ సినిమాని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించడంలో విఫలమయ్యారు అంతేకాకుండా పెద్ద ఎత్తున సస్పెన్స్ పెట్టడం ప్రేక్షకులకు బోర్ కొట్టించే అంశంగా నిలిచింది.

Read More: నేను బ్రతుకొద్దా… రెమ్యూనరేషన్ పెంపు పై ఘాటుగా స్పందించిన సుహాస్?

ట్రెండింగ్ వార్తలు