విజయ్ సేతుపతి, సందీప్ కిషన్ ‘మైఖేల్‌’ లో ప్ర‌తి నాయ‌కుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్

November 22, 2021

విజయ్ సేతుపతి, సందీప్ కిషన్ ‘మైఖేల్‌’ లో ప్ర‌తి నాయ‌కుడిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్
దర్శకుడిగా, నటుడిగా గౌతమ్ మీనన్ ఇప్పటికే అందరినీ తన టాలెంట్‌తో అంద‌రినీ మెప్పించాడు. ప్ర‌స్తుతం సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న మైఖేల్ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడిగా మ‌రో సారి అల‌రించ‌డానికి సిద్ద‌మ‌య్యాడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో చేతికి రక్తం, బేడీలు చూస్తుంటే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. సందీప్ కిష‌న్‌, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ క‌లిసి ఒకే సినిమాలో న‌టిస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంఛ‌నాలు ఉండే అవ‌కాశం ఉంది. రజింత్ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. నటీనటులకు ఈ చిత్రం స్పెషల్‌గా నిలిచిపోనుంది. 

ట్రెండింగ్ వార్తలు