Guntur Kaaram Movie Review: గుంటూరు కారం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

January 12, 2024

గుంటూరు కారం

గుంటూరు కారం

  • Cast : మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జయరాం, జగపతిబాబు, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్ తదితరులు
  • Director : త్రివిక్రమ్ శ్రీనివాస్
  • Producer : సూర్యదేవర రాధాకృష్ణ
  • Banner : హారిక & హాసిని క్రియేషన్స్
  • Music : తమన్

2.5 / 5

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీలా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. అలాగే ఇందులో రమ్యకృష్ణ జయరాం జగపతిబాబు వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్ లాంటి వారు కీలకపాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి పండుగ కానుకగా 2024, జనవరి 12న అనగా నేడు ఈ సినిమా థియేటర్లలోకి విడుదల అయింది. విడుదలకు ముందే భారీగా అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమా అసలు కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..

కథ:

వెంకట రమణ (మహేష్ బాబు) గుంటూరు మిర్చి యార్డులో ఉంటాడు. పదేళ్ల వయసులోనే అమ్మ (రమ్యకృష్ణ) వదిలేసి వెళ్లడంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు. అయితే పాతికేళ్ల తర్వాత తాత (ప్రకాష్ రాజ్) నుంచి రమణ కు పిలుపు వస్తుంది. కూతురు రాజకీయ జీవితానికి అడ్డు రాకుండా ఉండాలని రమణతో ఒక సంతకం చేయించాలి అనుకుంటాడు ఆయన తాత. కానీ అమ్మ మీద కోపంతో రమణ ఆ సంతకం చేయడు. ఈ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు లాయర్ పాని (మురళి శర్మ) కూతురు ఆముక్త మాల్యద (శ్రీలీల) చూసి ప్రేమలో పడతాడు.మరి పదేళ్ల వయసులోనే రమణను అమ్మ ఎందుకు వదిలేస్తుంది? వదిలేయడానికి గల కారణం ఏమిటి? చివరికి తల్లి కొడుకులు ఒకటవుతారా లేదా? ఆ తర్వాత పాతికేళ్లకు మళ్ళీ ఎందుకు పిలుస్తుంది? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ:

సినిమాకు కావాల్సిన బలమైన పాయింట్‌ను తొలి పది నిమిషాల్లోనే రివీల్ చేసిన త్రివిక్రమ్ వెంటనే హీరోను ఇంట్రడ్యూస్ చేశారు. మహేష్ తన మార్కు ఎంట్రీ, యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో నాది నెక్లెస్ గొలుసు, ఒక్కడు పాటలకు శ్రీలీల వేసిన డ్యాన్సులు అదరగొట్టాయి. మహేష్, శ్రీలీల మధ్య రొమాంటిక్ సీన్లు చాలా క్లాసీగా సైటైరికల్ డైలాగ్స్‌తో మంచి ఫీల్, ఫన్ క్రియేట్ చేశాయి. ఇంటర్వెల్‌కు భారీ యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్‌తో ఫస్టాఫ్‌ను ముగించి సెకండాఫ్‌పై రెండింతలు అంచనాలు పెంచేశారు. ఇక సెకండాఫ్‌లో రవిశంకర్, అజయ్ ఘోష్, అజయ్ క్యారెక్లర్లతో డిజైన్ చేసిన విధానం చాలా హిలేరియస్‌గా ఉంది. ఈ మూడు ఎపిసోడ్స్ సినిమాకు మంచి ఫన్ స్టఫ్ క్రియేట్ చేస్తాయి. లేడీస్ ఫైట్ ఎపిసోడ్ సినిమాకు మరో హైలెట్. ఫైనల్‌గా త్రివిక్రమ్ మార్క్ సినిమాగా ముగుస్తుంది.

నటీనటులు:

మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి పూర్తిగా స్క్రీన్ మీద విశ్వరూపం చూపించాడు సూపర్ స్టార్. ఇందులో ముఖ్యంగా మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తన భుజాలపై గుంటూరు కారం సినిమాను మోసాడు. శ్రీ లీల ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మీనాక్షి చౌదరి జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతే. డైలాగ్స్ పెద్దగా ఉండవు. రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా అంతంత మాత్రం గానే ఉంది. ఇంపార్టెంట్ రోల్ అయినా కూడా ఎందుకు త్రివిక్రమ్ ఆమెను పూర్తిస్థాయిలో వాడుకోలేదు అనిపించింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, జయరాం లాంటి వాళ్ళు వాళ్ల పాత్రల పరిధి మేరకి బాగానే నటించారు.

బాటమ్ లైన్: కుటుంబంత్తో పండగకి హాయిగా చూసి ఆనందించే సినిమా

Read More: HanuMan Movie Review: హనుమాన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

ట్రెండింగ్ వార్తలు