HanuMan Movie Review: హనుమాన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

January 12, 2024

హను-మాన్‌

హను-మాన్‌

  • Cast : తేజ సజ్జా, అమృత అయ్యర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిషోర్‌, సత్య, గెటప్‌ శ్రీను తదితరులు
  • Director : ప్రశాంత్ వర్మ
  • Producer : నిరంజన్‌రెడ్డి
  • Banner : ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
  • Music : అనుదీప్‌ దేవ్‌, గౌరా హరి, కృష్ణ సౌరభ్‌

3 / 5

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్,సత్య వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ నేడు అనగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్ గా అయ్యింది. మరి విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పరచుకున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమాలో అసలు కథ ఏమిటి? ఎలా ఉంది అన్న వివరాల్లోకి వెళితే..

కథ:

సౌరాష్ట్ర లో ఉండే మైఖేల్‌ (వినయ్‌ రాయ్‌)కు చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని కోరిక ఉంటుంది. తన కోరికకు అడ్డుపడుతున్నారని చిన్నతనంలోనే తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు. ఆ తర్వాత సూపర్ హీరో అవ్వడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ తన ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. దీంతో అసలు సిసలు సూపర్‌ పవర్స్‌ కనిపెట్టేందుకు వేట మొదలు పెడతాడు. కట్‌ చేస్తే కథ అంజనాద్రికి మారుతుంది. పాలెగాడు గజపతి (దీపక్‌ శెట్టి) అకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరది. అతనిని ఎదిరించిన వాళ్లను ఊరి మధ్యలోనే కుస్తీ పోటీల్లో మట్టుపెడుతుంటాడు. ఆ ఊరిలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు హనుమంతు (తేజ సజ్జా). తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి అక్క అంజమ్మే (వరలక్ష్మీ) అతనిని పెంచి పెద్ద చేస్తుంది. హనుమంతుకు మీనాక్షి (అమృత అయ్యర్‌) అంటే చచ్చేంత ప్రేమ. ఆమె ఒక రోజు గజపతికి ఎదురు తిరగడంతో అతను తన బందిపోటు ముఠాతో ఆమెపై దాడి చేయిస్తాడు. అయితే ఆ దాడి నుంచి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు తీవ్రంగా గాయపడతాడు. అతన్ని బందిపోటు ముఠా నీళ్లలో పడేయగా, దాంట్లో అతనికి ఆంజనేయస్వామి రక్త బిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది. అది తన చేతికొచ్చిన తర్వాత నుంచి హనుమంతు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. తను ఆ మణి ద్వారా ఆంజనేయుడి శక్తులు పొంది హనుమ్యాన్‌గా మారతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ శక్తులతో అతను చేసిన సాహసాలేంటి? హనుమంతు దగ్గరున్న రుధిరమణిని చేజిక్కించుకునేందుకు మైఖేల్‌ ఏం చేశాడు? అతని నుంచి అంజనాద్రికి ఏర్పడ్డ ముప్పును హనుమంతు ఎలా తొలగించాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే హనుమాన్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

తెలుగు నేటివిటీ మిస్ కాకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీ కంటిన్యూ చేస్తూ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సూపర్ పవర్ కోసం విపరీతంగా ప్రయత్నించే విలన్, సాదాసీదా హీరో, సూపర్ పవర్ కోసం ఊరికి వచ్చిన విలన్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు, అనేది క్లుప్తంగా హనుమాన్ కథ. ముందు చెప్పినట్టు ఈ కథకు నేటివిటీ కామెడీ టచ్ ఇవ్వడంలో ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యారు. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ కామెడీ వర్కవుట్ అయ్యింది. హీరో తేజ సజ్జ క్యారెక్టర్ విషయంలో దర్శకుడి తెలివిగా వ్యవహరించారు.

నటీనటుల పనితీరు:

హీరో తేజా సజ్జా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా కథ మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించారు హీరో తేజా. కామెడీ, ఎమోషన్‌తో పాటు యాక్షన్‌ సీన్స్‌ని కూడా ఇరగదీశాడు. కావాల్సిన చోట మాత్రమే హీరోయిజాన్ని చూపించాడు. సాధారణ మనిషిగా సూపర్‌ పవర్స్‌ ఉన్న హనుమాన్‌గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన తేజ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌స్ చూపించి ఆకట్టుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమృత అయ్యర్‌ తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్రఖని పోషించిన పాత్రలోని సస్పెన్స్‌ని తెరపై చూడాల్సిందే. వినయ్‌ రాయ్‌ స్టైలీష్‌ విలన్‌గా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేర బాగా నటించారు.

బాటమ్ లైన్: హనుమాన్.. విజయ విన్యాసం

Read More: బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేసిన హనుమాన్.. ఇది మామూలు విషయం కాదు

ట్రెండింగ్ వార్తలు