ఒక్క హిట్టుతో కోట్లలో రెమ్యూనరేషన్ పెంచిన తేజ.. టూ మచ్ అంటున్న నేటిజన్స్?

February 26, 2024

ఒక్క హిట్టుతో కోట్లలో రెమ్యూనరేషన్ పెంచిన తేజ.. టూ మచ్ అంటున్న నేటిజన్స్?

తెలుగు వెండితెరపై బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో తేజ సజ్జ ఒకరు. ఇలా బాల నటుడిగా ప్రేక్షకులను మెప్పించిన ఈయన అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా తేజ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించిన హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా స్టార్ హీరోలతో పోటీ పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే స్టార్ హీరోల సినిమాలను కూడా వెనక్కినెట్టి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుని కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో హీరో తేజకు బాలీవుడ్ లో కూడా అభిమానులు పెరిగిపోయారు. ఈ క్రమంలోనే ఈయనతో తదుపరి సినిమాలు చేయడం కోసం నిర్మాతలు పెద్ద ఎత్తున ఈయనని సంప్రదిస్తూ అడ్వాన్సులు కూడా చెల్లిస్తున్నారట. ఇక హనుమాన్ సినిమా హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా తేజ రెమ్యూనరేషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.

సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ హీరోలు తన రెమ్యూనరేషన్ పెంచడం సర్వసాధారణం అయితే తేజ నటించిన హనుమాన్ సినిమా హిట్ కావడంతో ఈయన ఏకంగా కోట్లలో రెమ్యూనరేషన్ పెంచేసారని తెలుస్తోంది. హనుమన్ సినిమా కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి తేజ ప్రస్తుతం మాత్రం ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇలా ఈయన ఐదు కోట్ల డిమాండ్ చేస్తున్నప్పటికి నిర్మాతలు ఇతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ నేటిజన్స్ మాత్రం ఒక సినిమా హిట్ అయితేనే ఏకంగా కోట్లలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. తేడా కొడితే కష్టమే అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.

Read More: ఆ విషయంలో వరుణ్ పై ఫైర్ అయిన మెగాస్టార్.. నా దగ్గర దాచారంటూ?

ట్రెండింగ్ వార్తలు