April 24, 2024
టాలీవుడ్ ప్రేక్షకులకు యంగ్ హీరో తేజ సజ్జ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జ పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజా ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు ఇలా ఒకప్పటి టాప్ స్టార్లు చాలామందితో స్క్రీన్ షేర్ చేసుకున్న తేజ ముందుగా ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు.
తర్వాత జాంబి రెడ్డి తో హీరోగా మారి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక అతడి దశ తిరిగేలా చేసింది మాత్రం హనుమాన్ మూవీనే అని చెప్పాలి. ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తేజ కెరీర్‌నే మార్చేసింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీ టాలీవుడ్‌లో హిస్టరీగా నిలిచిపోయింది. హనుమాన్ మూవీని మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ గొప్పగా ఆదరించారు. ఈ సినిమా విడుదల అయ్యి 100 రోజులు సక్సెస్ఫుల్గా ఆడిన సందర్భంగా మూవీ మేకర్స్ 100 రోజుల ఫంక్షన్ ఏర్పాటు చేశారు.
ఈ వంద రోజుల ఫంక్షన్‌లో భాగంగా తేజ సజ్జ మాట్లాడుతూ తన స్పీచ్ తో అదరగొట్టేసాడు. ఈ సందర్భంగా తేజా మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డి చాలా గట్స్ ఉన్న వ్యక్తులు. గట్స్ ఉన్న వారికే హిట్స్ వస్తాయి. వాళ్లకి గట్స్ ఉన్నాయ్ కాబట్టే సినిమాను తీశారు. ధైర్యంగా ఏ పని చేసినా సక్సెస్ అవుతాము అని చెప్పుకొచ్చాడు. అందరూ కూడా ధైర్యంగా ముందుకు అడుగు వేయండి అంటూ సలహా ఇచ్చారు తేజ. ఈ సందర్భంగా ఈవెంట్లో భాగంగా తేజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read More: కొత్త పార్లమెంట్‌లో రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీలు.. నెట్టింట ఫోటోస్ వైరల్!