బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేసిన హనుమాన్.. ఇది మామూలు విషయం కాదు

January 11, 2024

బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేసిన హనుమాన్.. ఇది మామూలు విషయం కాదు

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. కే నిరంజన్ నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. చిన్న సినిమాగా విడుదలవుతున్నటువంటి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నప్పటికీ థియేటర్ల విషయంలో మాత్రం ఈ సినిమాకు కాస్త అన్యాయం జరిగిందని నిర్మాతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఈ సినిమా 12వ తేదీ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రీమియర్ షోలు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్ విషయంలో ఈ సినిమా బాహుబలి సినిమాని కూడా బీట్ చేసిందని తెలుస్తుంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడల్లో భారీగా ప్రీమియర్లు ప్రదర్శించారు. వైజాగ్‌లో బాహుబలి 2 కంటే ఎక్కువగా ప్రీమియర్లు ప్రదర్శించడం విశేషంగా మారింది. ఈ సినిమా ప్రీమియర్లకు భారీ బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే బిజినెస్ జరుపుకుందని తెలుస్తుంది. నైజం ఏరియాలో ఈ సినిమా హక్కులను మైత్రి మూవీస్ వారు కొనుగోలు చేశారు. నైజం ఏరియాలో ఈ సినిమా 7.5 కోట్లు బిజినెస్ జరపగా సీడెడ్4 కోట్లు ఆంధ్ర 10 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకుంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో 21.5 కోట్ల మేర అమ్మడం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు 2 కోట్ల మేర అమ్ముడుపోయాయి. అలాగే ఓవర్సీస్ రైట్స్ కూడా భారీగా అంటే.. 4 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ కావడంతో భారీ స్థాయిలోనే స్పందన లభిస్తుందని తెలుస్తుంది. ఇక తెలుగులో కాకుండా కన్నడలో కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా ఓపెన్ అయ్యాయి. 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 45 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read More: ఇది ఆరంభం మాత్రమే.. కంగువ సినిమా పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సూర్య!

ట్రెండింగ్ వార్తలు