అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న మరో హీరోయిన్.. చైతూ బాటలోనే అఖిల్!

April 23, 2024

అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న మరో హీరోయిన్.. చైతూ బాటలోనే అఖిల్!

అక్కినేని ఇంట త్వరలోనే పెళ్లి భాజాలు మోగబోతున్నాయని తెలుస్తుంది. అక్కినేని అఖిల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఈయన ఇంటికి మరో హీరోయిన్ కోడలిగా అడుగు పెట్టబోతోందని తెలుస్తుంది. ఇప్పటికే సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలుస్తుంది. నిజానికి ఈ పెళ్లి నాగార్జునకు ఏ మాత్రం ఇష్టం లేదట కాకపోతే బలవంతంగా తనని ఒప్పించి ఈ పెళ్లి చేశారని తెలుస్తుంది.

ఇలా పెళ్లయినటువంటి కొద్ది రోజులకే సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు. అఖిల్ కూడా మరొక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారట. ఈయనతో కలిసి పనిచేస్తున్నటువంటి ఒక హీరోయిన్ తో ఈయన రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక వీరి ప్రేమ పెళ్లికి నాగార్జున అమల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో త్వరలోనే వీరికి పెళ్లి జరగబోతుందని ఇదే విషయాలను అధికారికంగా వెల్లడించనున్నారని తెలుస్తుంది.

ఇలా హీరోయిన్ అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలియడంతో తన అన్నయ్య నాగచైతన్య బాటలోనే అఖిల్ కూడా పయనిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈయన గతంలో శ్రియ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహం బ్రేకప్ కావడంతో నిఖిల్ అప్పటినుంచి పెళ్లి గురించి ఆలోచించకుండా కెరియర్ పైనే తన ఫోకస్ పెట్టారు.

అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన ఇప్పటివరకు పలు సినిమాలలో నటించారు. అయినప్పటికీ ఏ ఒక్క సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు. ఇలా సక్సెస్ కోసం అఖిల్ ఎంతగానో కష్టపడుతున్నారని చెప్పాలి. ఇక చివరిగా అఖిల్ ఏజెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు..

Read More: మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. వారి కోసం ఏకంగా 35 లక్షల రూపాయలు డొనేషన్!

Related News

ట్రెండింగ్ వార్తలు