మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. వారి కోసం ఏకంగా 35 లక్షల రూపాయలు డొనేషన్!

April 23, 2024

మంచి మనసు చాటుకున్న ప్రభాస్.. వారి కోసం ఏకంగా 35 లక్షల రూపాయలు డొనేషన్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రభాస్ నిజజీవితంలో ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా అందరూ భావిస్తూ ఉంటారు. ఎవరికైనా ఆపద ఉంది అంటే తానున్నానంటూ ముందుకు వస్తూ ఉంటారు అంతేకాకుండా తన ఇంటికి ఎవరైనా వస్తే కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తారు.

ఇలా ఇతరులకు సహాయం చేసే విషయంలోనూ ఆతిథ్యం ఇచ్చే విషయంలోనూ ప్రభాస్ కి మించిన వారు ఎవరూ లేరనే చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీలో కూడా ఇప్పటికే ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభాస్ మరోసారీ మంచి మనసు చాటుకున్నారు.తాజాగా ప్రభాస్ తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కి డొనేషన్ ఇచ్చారు. త్వరలో మే 4న దాసరి నారాయణరావు జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న డైరెక్టర్స్ డేని ఈ సారి ఘనంగా నిర్వహించబోతున్నారు.

స్టేడియంలో భారీ జనాల మధ్య టాలీవుడ్ లోని ప్రముఖులు అంతా హాజరవుతూ ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. అయితే ఈ వేడుకకు ప్రభాస్ ఏకంగా 35 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చినట్లు డైరెక్టర్ మారుతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభాస్ తనకు ఇటీవల ఫోన్ చేసి డైరెక్టర్ అసోసియేషన్ కి తాను 35 లక్షల రూపాయల డొనేషన్ ఇస్తున్నట్లు చెప్పారని మారుతి తెలియజేయడంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా ప్రభాస్ మరోసారి మంచి మనసు చాటుకుని భారీ మొత్తంలో డొనేషన్ ఇచ్చారు. ఇక ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే .ఈ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు స్పిరిట్ కల్కి వంటి సినిమా పనులలో కూడా ప్రభాస్ బిజీగా ఉన్నారు.

Read More: ఎవరితో చేసుకుంటారో చేసుకోండి.. జెర్సీ 2 పై నాని షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు