May 2, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించినటువంటి వారిలో నటుడు నరేష్ ఒకరు. ఈయన ఇదివరకు ఎన్నో అద్భుతమైన కామెడీ చిత్రాలలో నటించారు. అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఎంతో విభిన్నమైనటువంటి యాక్షన్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి తనలో ఈ యాంగిల్ కూడా ఉందా అని నిరూపించుకున్నారు.
ఇకపోతే తిరిగి మరోసారి సరికొత్త కామెడీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నరేష్ ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించినటువంటి చిత్రం ఆ ఒక్కటి అడక్కు ఈ సినిమా మే మూడవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నరేష్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నరేష్ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ప్రస్తుత కాలంలో పెళ్లి చుట్టూ ఉన్నటువంటి ఎన్నో స్కాముల ఆధారంగానే ఈ సినిమాని చేసామని తెలిపారు. ఈ సినిమా కూడా పెళ్లి చుట్టూ తిరుగుతుందని తెలిపారు. తాను కామెడీ సినిమాలు చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించడం అంటే మామూలు విషయం కాదని ఈయన తెలిపారు.
ఇక ఇటీవల కాలంలో ఇలాంటి కామెడీ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ ఉంది కంటెంట్ ఉంటే సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఈయన తెలియజేశారు. ఇలా తన సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తనకు టాలీవుడ్ హీరోతో కలిసి నటించాలని ఉంది అనే కోరికను కూడా ఈ సందర్భంగా పెట్టారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి సీనియర్ నటుడు వెంకటేష్ గారితో కలిసి తనకు నటించాలని ఉందని ఆయనతో పాటు కలిసి ఓ కామెడీ సినిమా చేయాలని ఉంది అంటూ ఈ సందర్భంగా నరేష్ వెల్లడించారు. ఇక వెంకటేష్ తో పాటు తనకు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: పవన్ ప్రశాంతత కోసం అలాంటి సినిమాలు చూస్తారా.. ఈ అలవాటు ఏంది సామీ?