పవన్ ప్రశాంతత కోసం అలాంటి సినిమాలు చూస్తారా.. ఈ అలవాటు ఏంది సామీ?

May 2, 2024

పవన్ ప్రశాంతత కోసం అలాంటి సినిమాలు చూస్తారా.. ఈ అలవాటు ఏంది సామీ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. సినీ నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అనంతరం రాజకీయాలలోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించారు. ఇకపోతే ఎన్నికలలో ఈయన భీమవరం గాజువాక నుంచి పోటీ చేశారు కానీ ఎక్కడ కూడా గెలుపు అందుకోలేకపోయారు కానీ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు.

పిఠాపురంలో కాపుల అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఈయన ఈసారి మాత్రం పక్కా గెలుస్తారని తెలుస్తుంది. ఇలా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా రాపిడ్ ఫెయిర్ సెషన్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు పవన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మీరు రాత్రిపూట పడుకోవడానికి ముందు ఈరోజు ఈ సినిమా చూడాలి అనుకుంటే ఎలాంటి సినిమాలను చూస్తారు అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు పవన్ సమాధానం చెబుతూ తాను హర్రర్ సినిమాలు చూస్తాను అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హర్రర్ సినిమాలు చూడటం ఏంటి అనే మరో ప్రశ్న ఎదురుగా తాను ఇలాంటి సినిమాలను చూసినప్పుడే తన మైండ్ మొత్తం సైలెంట్ అయ్యి ప్రశాంతత దొరుకుతుంది. బయట నిజ జీవితంలో కనిపించే డెవిల్స్ కంటే.. హారర్ సినిమాల్లో వచ్చే డెవిల్స్ ని చూడడానికి ఇష్టపడతాను అంటూ పవన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ రాపిడ్ ఫైర్ సెషన్ లో భాగంగా మీకు ఇష్టమైన పాట ఏది అనే ప్రశ్న కూడా ఎదురయింది. ఈ ప్రశ్నకు పవన్ సమాధానం చెబుతూ ఏ రాతే ఏ మౌసమ్ అనే హిందీ పాటను పాడారు అయితే ఇదే పాట ఒక వేదికపై తన కుమార్తె ఆధ్య కూడా పాడటంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది ఇది చూసినటువంటి అభిమానులు సరిపోయారు ఇద్దరే ఇద్దరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More: టిల్లుతో రొమాన్స్ చేయటానికి సిద్ధమైన బుట్ట బొమ్మ పూజా హెగ్డే?

ట్రెండింగ్ వార్తలు