పవన్ కోసం అలాంటి త్యాగం చేసిన రేణు దేశాయ్.. నిజంగా గ్రేట్ అంటూ?

May 8, 2024

పవన్ కోసం అలాంటి త్యాగం చేసిన రేణు దేశాయ్.. నిజంగా గ్రేట్ అంటూ?

సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించి రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈయన జనసేన పార్టీని స్థాపించి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత ఈయన పట్ల పలువురు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. ముఖ్యంగా ఈయన పెళ్లి విడాకుల గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన నటి రేణు దేశాయ్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు బద్రి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు అనంతరం పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు.

ఇలా పెళ్లి పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రేణు దేశాయ్ విడాకులు ఇచ్చి తన పిల్లలను తీసుకొని ఒంటరిగా బ్రతుకుతున్నారు. తాజాగా రేణు దేశాయ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. బద్రి సినిమా సమయంలోనే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ప్రేమలో పడటంతో ఇకపై తాను సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమా తర్వాత ఆమె ఎలాంటి సినిమాలలోనూ నటించలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన జాని సినిమాలో మాత్రమే నటించారు.

ఇక పవన్ కళ్యాణ్ తప్ప తనకు వేరే ప్రపంచం లేదు అనే విధంగా ఈ బ్రతికారు. బద్రి సినిమా మంచి సక్సెస్ కావడంతో నిర్మాతలు చెక్కులు పట్టుకొని ఈమె ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన ఈమె మాత్రం సినిమాలను ఒప్పుకోలేదు అయితే ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశారని చెప్పాలి ముఖ్యంగా బద్రి సినిమా సక్సెస్ కావడంతో కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మురారి సినిమాలో కూడా అవకాశం వచ్చిందట కానీ పవన్ కళ్యాణ్ కోసమే ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలిసి ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read More: దిల్ రాజు చాలా సార్లు కొట్టారు.. ఇప్పటికీ నా చెయ్యి పని చెయ్యదు: సుకుమార్

ట్రెండింగ్ వార్తలు