అవకాశాలు రావాలంటే సర్దుకుపోవాల్సిందే.. క్యాస్టింగ్ కౌఛ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్?

May 8, 2024

అవకాశాలు రావాలంటే సర్దుకుపోవాల్సిందే.. క్యాస్టింగ్ కౌఛ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌఛ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశాలు అందుకోవాలని లేదంటే ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి అవకాశాలను అందుకోవాలని కూడా హీరోయిన్లకు ఈ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయని ఇప్పటికే ఎంతోమంది పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇకపోతే చాలా మంది హీరోయిన్లు తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమంటూ పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. అయితే తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ సైతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌఛ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

క్యాస్టింగ్ కౌఛ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదని అన్ని రంగాలలోనూ ఉందని తెలిపారు. అయితే సినిమా వాళ్ళు ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడటంతో అందరి దృష్టి సినిమా వాళ్ళ పైనే ఉందని తెలిపారు. అయితే సినీ ఇండస్ట్రీలో చాలామంది క్యాస్టింగ్ కౌఛ్ గురించి తప్పుడు ప్రచారాలను కూడా చేస్తూ ఉంటారని ఈమె తెలిపారు. నా వరకు అయితే నేను ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదని ఈమె తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలి అంటే కొన్నిసార్లు హీరోయిన్లు సర్దుకుపోవాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌఛ్ పై రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈమె 90 లలో స్టార్ హీరోయిన్గా తెలుగు తమిళం భాష చిత్రాలలో నటిస్తూ ఓ వెలుగు వెలిగారు. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఇప్పటివరకు సుమారు 200 సినిమాలలో నటించి రమ్యకృష్ణ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారనే చెప్పాలి.

Read More: షూటింగ్ ఉందంటే బన్నీ ముందు రోజు అలాంటి పని చేస్తారా.. ఇప్పటికి ఆ రూల్ బ్రేక్ చేయలేదా?

Related News

ట్రెండింగ్ వార్తలు