నాకు ఆయన అంటే ఇష్టం నా ఓటు అతనికే.. జనం నేను వేయమంటే వేయరుగా: యాంకర్ రవి

May 8, 2024

నాకు ఆయన అంటే ఇష్టం నా ఓటు అతనికే.. జనం నేను వేయమంటే వేయరుగా: యాంకర్ రవి

ఏపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఎంతో మంది టీవీ ఆర్టిస్టులు సినిమా సెలబ్రిటీలు భాగమైన సంగతి మనకు తెలిసిందే. ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే కేవలం సినిమా వాళ్లు మాత్రమే వచ్చేవారు కానీ ఇప్పుడు టీవీలకు కూడా మంచి ఆదరణ పెరగడంతో టీవీ ఆర్టిస్టులు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో జబర్దస్త్ టీం తో పాటు ఇతర సీరియల్ ఆర్టిస్టులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ రాజకీయాల గురించి యాంకర్ రవి మాట్లాడారు.

ఈయన యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆడాళ్లు మీకు జోహార్లు కార్యక్రమం 60 ఎపిసోడ్స్ కావడంతో ఈయన మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఏపీ పాలిటిక్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నాకు రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేదు మనం ఏదైనా మాట్లాడాలి అంటే అవగాహన ఉండి మాట్లాడితేనే మంచిదని తెలిపారు.

ఇప్పుడు చాలామంది టీవీ ఆర్టిస్టులు రాజకీయ ప్రచార కార్యక్రమాలకు వెళ్తున్నారా అయితే వారికి రాజకీయాల గురించి అవగాహన ఉంటుంది కనుక వెళ్తున్నారని ఈయన తెలిపారు. అయితే నన్ను కూడా చాలామంది తెలంగాణలోనూ ఇప్పుడు ఏపీలో కూడా ప్రచార కార్యక్రమాలకు రమ్మని కోరారు వస్తే చాలా డబ్బు ఇస్తామని కూడా చెప్పారు అయితే నాకు రాజకీయాలపై అవగాహన లేకపోవడంతో నేను వెళ్లలేదని తెలిపారు.

ఇక ఎన్నికల పరంగా చూసుకుంటే నాకు మోడీ గారు అంటే ఇష్టం నేను ఆయనకే ఓటు వేస్తాను కానీ పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఇష్టం అలాగని నేను మోడీకి ఓటు వేస్తానని జనాలకి కూడా మోడీకే ఓటు వేయమని చెప్తే వేయరు కదా.. మనం చెబితే ప్రజలు వింటారు కానీ ఓటు మాత్రం వారికి నచ్చిన వారికి మాత్రమే వేస్తారు అంటూ ఈ సందర్భంగా రవి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: అవకాశాలు రావాలంటే సర్దుకుపోవాల్సిందే.. క్యాస్టింగ్ కౌఛ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్?

ట్రెండింగ్ వార్తలు