May 8, 2024
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఇటీవల ఆర్య సినిమా విడుదల పూర్తి చేసుకోవడంతో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఆర్య సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డారని అప్పటి నుంచి తాను షూటింగ్ సమయంలో ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతున్నానని వెల్లడించారు. తనకు న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం ఆరోజు నైట్ ఫుల్లుగా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను అలాగే ఆర్య సినిమా సమయంలో కూడా న్యూ ఇయర్ ముందు రోజు బాగా పార్టీ చేసుకొని ఎంజాయ్ చేశాను అయితే మరుసటి రోజు ఉదయమే షూటింగ్ ఉందని ఫోన్ వచ్చింది ఈ సినిమాలో తకధిమితోమ్ అనే పాట షూటింగ్ కోసం రమ్మని చెప్పారు వెళ్లాను అయితే ఆ రోజు నైట్ నిద్ర లేకపోవడం మరోవైపు ఎండ ఉండటం వల్ల నేను షూటింగ్ చేయలేకపోయానని అల్లు అర్జున్ తెలిపారు.
ఆరోజు నేను పడినటువంటి ఇబ్బంది మరోసారి పడకూడదని షూటింగ్ ఉంది అంటే ముందు రోజు రాత్రి పదిలోపు నిద్రపోవాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పటికీ కూడా షూటింగ్ ఉందంటే కచ్చితంగా ముందు రోజు రాత్రి అదే పని చేస్తానని ఎలాంటి పార్టీలు ఈ వెంట్ లకు వెళ్ళనని అల్లు అర్జున్ తెలిపారు. ఇప్పటికీ నేను అదే నియమం పాటిస్తున్నానని తన రూల్ బ్రేక్ చేయలేదు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read More: మెగా హీరోలతో సినిమా చేస్తే.. సినిమా మన చేతుల్లో ఉండదు.. బేబీ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!