రహస్యంగా నిశ్చితార్థం.. వారికి మాత్రమే రహస్యం అంటున్న సిద్ధార్థ్!

April 8, 2024

రహస్యంగా నిశ్చితార్థం.. వారికి మాత్రమే రహస్యం అంటున్న సిద్ధార్థ్!

సౌత్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అయినటువంటి నటుడు సిద్ధార్థ్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఒకానొక సమయంలో తమిళంలోనూ తెలుగులోనూ ఎన్నో మంచి సినిమాలలో నటించినటువంటి సిద్ధార్థ్ ప్రస్తుతం సినిమాలను కాస్తా తగ్గించారని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో ఈయన సినిమాల పరంగా కాకుండా తన వ్యక్తిగత విషయాల వల్ల పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.

అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ్ నటి ఆదితి రావు హైదరితో కలిసి నటించారు. ఈ సినిమా సమయం నుంచి వీధి ఇద్దరు ప్రేమలో పడ్డారు ఇలా ప్రేమలో పడినటువంటి ఈ జంట పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇటీవల తెలంగాణలోని ఒక ఆలయంలో వీరిద్దరు నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సిద్దార్థ్ కి తన ఎంగేజ్మెంట్ గురించి పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈయన రహస్యంగా ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నారనే ప్రశ్నలకు కూడా ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు సిద్దార్థ్ సమాధానం చెబుతూ సీక్రెట్, ప్రవేట్ అనే పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని తెలిపారు. నేను ఎవరినైతే ఈ ఎంగేజ్మెంట్ కి ఆహ్వానించలేదు వారందరికీ ఇది సీక్రెట్ ఎంగేజ్మెంట్ అని తెలిపారు.

నిజానికి మా ఎంగేజ్మెంట్ మా పెద్దల సమక్షంలో ప్రైవేటుగా జరిగిందని ఈయన తెలియజేశారు. ఇక మీ ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి అదితి ఎన్ని రోజుల సమయం తీసుకుందనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురు అవడంతో తను ఎంత సమయం తీసుకుంది అనేది ఇంపార్టెంట్ కాదని ఎస్ చెబుతుందా లేక నో చెబుతుందా అనేది ఫైనల్ రిజల్ట్ అని దాని కోసం నేను కాస్త టెన్షన్ కూడా పడ్డానని సిద్ధార్థ్ తెలిపారు. అయితే ఫైనల్ గా ఆమె తన ప్రేమకు ఎస్ చెప్పడంతో సంతోషం అనిపించింది అంటూ ఈ సందర్భంగా ఈయన తన ప్రేమ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: జనసేన పార్టీకి ఐదు కోట్లు విరాళం ఇచ్చిన మెగా కోడలు ఉపాసన?

Related News

ట్రెండింగ్ వార్తలు