April 18, 2024
సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు విశాల్ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఈయన కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో కూడా విడుదల కావడంతో తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల విశాల్ నటించిన రత్నం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమా ఏప్రిల్ 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల విశాల్ హైదరాబాదులో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇక విశాల్ పెళ్లి వయసు దాటిపోయిన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు గతంలో ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నటువంటి విశాల్ తనతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే రత్నం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన పెళ్లి గురించి ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈయన పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయం గురించి స్పందిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ పెళ్లి తర్వాతనే తన పెళ్లి జరుగుతుంది అంటూ కామెంట్లు చేశారు.
ప్రభాస్ అన్న పెళ్లి చేసుకున్న వెంటనే నేను కూడా పెళ్లి చేసుకుంటానని నా మొదటి వెడ్డింగ్ కార్డ్ ప్రభాస్ కి ఇస్తాను అంటూ విశాల్ కామెంట్స్ చేయడం గమనార్హం. అయితే ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్న తర్వాతే అంటూ మాట మారుస్తూ ఉంటారు. ఇలా పెళ్లి గురించి విశాల్ చేసిన ఈ కామెంట్స్ పైన స్పందిస్తూ సరిపోయారు ఇద్దరికీ ఇద్దరే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read More: విక్రమ్ వీర ధీర సూరన్ సినిమా టీజర్ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్?