విక్రమ్ వీర ధీర సూరన్ సినిమా టీజర్‌ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్?

April 18, 2024

విక్రమ్ వీర ధీర సూరన్ సినిమా టీజర్‌ రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీజర్?

తమిళ విలక్షణ నటుడు విక్రమ్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. అయితే విక్రమ్ వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలో మాత్రం ఎందుకు విడుదల అవడం లేదు. ఇప్పటికే రెండు సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేసి, రిలీజ్ సిద్ధం చేసిన విక్రమ్ అనుకోని కారణాల వల్ల వాటి విడుదలని పోస్టుపోన్ చేశారు. అవి థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తాయో అన్నది ఇప్పటికి క్లారిటీ లేదు. ఇంకా విడుదల కాకపోవడంతో అభిమానులు ఆందోళన చిన్న చిన్న సమయంలో విక్రమ్ మరో కొత్త సినిమా టీజర్ తో వచ్చేసారు.

ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో విక్రమ్ వీర ధీర సూరన్ అనే సినిమాని చేస్తున్నారు. అయితే తాజాగా విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక యాక్షన్ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. దాదాపు 4 నిముషాలు పాటు ఉన్న ఈ యాక్షన్ టీజర్ మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ చేసేలా ఉంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

కాగా విక్రమ్ నటించిన ధ్రువ నక్షత్రం, తంగలాన్ సినిమాలు ఇప్పటికే ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు రిలీజ్ వరకు వచ్చి వాయిదా పడ్డాయి. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ధ్రువ నక్షత్రం అయితే కొన్నేళ్ల నుంచి వాయిదా పడుతూనే వస్తుంది. ఇక పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ మూవీ జనవరిలో రిలీజ్ చేస్తామంటూ ముందుగా అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ చేయలేదు. నేడు బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు గాని రిలీజ్ డేట్ తెలపలేదు.

Read More: అప్పుడే పవన్ తో ప్రేమలో పడిపోయా.. లవ్ స్టోరీ బయటపెట్టిన రేణు దేశాయ్!

ట్రెండింగ్ వార్తలు