May 1, 2024
బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా వరుస పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమె సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇకపోతే అనసూయ ఎక్కువగా బాడీ షేమింగ్ ట్రోల్స్ కూడా ఎదుర్కొంటారనే సంగతి తెలిసిందే. ఈమె ఉన్న ఫలంగా శరీర బరువు పెరిగిపోవడం ఒక్కోసారి సన్నగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఇలా అనసూయ షేప్ అవుట్ అవ్వడంతో చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈమె తాను అలా బాడీ షేప్ అవుట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను ఓ సందర్భంలో వెల్లడించారు.
తాను ఇలా బాడీ షేప్ అవుట్ అవ్వడానికి కారణం వర్కౌట్స్ చేయకపోవడం వల్ల ఇలా స్లిమ్ గా మారడం బొద్దుగా మారడం అనేది జరగలేదని తాను బ్రీతింగ్ సమస్యతో బాధపడుతూ ఉంటానని అనసూయ తెలియచేశారు. అనసూయ డైటింగ్ చేస్తుందట. అయితే అందంగానే ఉన్నావు కదా.. డైటింగ్ ఎందుకు చేస్తున్నావు అని యాంకర్ ప్రశ్నించింది. అయితే తాను అందంగా కనిపించడం కోసం డైట్ చేయడం లేదని హెల్త్ కోసమే డైట్ చేస్తున్నానని తెలిపారు.
నాకు బ్రీతింగ్ సమస్య వల్ల హాస్పిటల్ లో ఆక్సిజన్ పెట్టాల్సిన స్టేజి వరకు పరిస్థితి వెళ్ళింది. హెల్త్ పరంగా అలా సమస్యలతో ఉండడం నాకు నచ్చలేదు. ఇక నేను ఎమోషనల్ కనుక అయితే నా కండరాలన్నీ కూడా నొప్పులు వస్తూ బ్రీతింగ్ సమస్య వచ్చేది అందుకే తాను యోగా చేయటం, వర్కౌట్స్ చేయడం వంటివి చేస్తున్నానని తెలిపారు. అయితే మనం ఫిజికల్ గా పిట్ గా ఉన్నప్పుడే మెంటల్ కండిషన్ కూడా బాగుంటుందని అందుకే తాను వర్కౌట్స్ చేస్తూ ఉంటాను అంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ఈ కామెంట్స్ లో వైరల్ అవుతున్నాయి.
Read More: పెళ్లి కాలేదు కానీ పిల్లల కోసం ఆ పని చేసిన నటి మెహ్రీన్!