క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన హిమజ.. అలాంటి వారికి అవకాశాలు రావంటూ!

April 17, 2024

క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన హిమజ.. అలాంటి వారికి అవకాశాలు రావంటూ!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో చాలా సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హిమజ. మొదటి సీరియల్స్ తో కెరియర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. తెలుగులో భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం వంటి సీరియల్స్ లో ఆమె నటించారు. వెండితెరపై ఎక్కువగా హీరోయిన్లకు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ లలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ పోతినేని హీరోగా నటించిన శివమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ ఫ్రెండ్, సపోర్టింగ్ రోల్స్ చేసింది. నిజానికి హిమజ హీరోయిన్ మెటీరియల్. కానీ ఆమెకు ఆఫర్స్ రాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజా ఇంటర్వ్యూలో తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ఆఫర్స్ రాకపోవడం పై ఆమె స్పందించారు. తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ గా ఉంటారనే వాదన ఉంది. అందుకే వాళ్లకు ఆఫర్స్ రావడం లేదని అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటని హిమజను యాంకర్ ప్రశ్నించగా హిమజ సమాధానమిస్తూ..

తెలుగు అమ్మాయిలు రిజర్వ్డ్ కాదని ఇప్పటికే రుజువైంది. విషయం ఏమిటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లందరికీ ఆఫర్స్ రావడం లేదు. అవకాశాలు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చినవాళ్లు కాదు అని హిమజ తెలిపింది. కొందరికి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ అత్యాశ వలన అవి చేజారుతున్నాయి. తెలుగు అమ్మాయిలను కాకుండా కన్నడ, మలయాళ భామలను తీసుకోవడానికి మరో కారణం ఉంది. కొన్ని పాత్రలకు కొందరు సెట్ అవుతారని హిమజ చెప్పుకొచ్చింది.

Read More: చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు మరో పెద్ద సమస్య వచ్చిందిగా.. ఇప్పట్లో విడుదల కష్టమే? 

Related News

ట్రెండింగ్ వార్తలు