ముద్దు సీన్ల కారణంగానే అవకాశాలు కోల్పోయాను.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్!

April 30, 2024

ముద్దు సీన్ల కారణంగానే అవకాశాలు కోల్పోయాను.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్!

మరాఠీ సీరియల్స్ చేస్తూ అనంతరం సినిమా అవకాశాలు అందుకుంటూ బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవల ఈమె ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ఇలా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈమెకు ఉన్నటువంటి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా సినిమాల ఎంపిక విషయంలో మాత్రం ఈమె చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మృణాల్ తన సినిమాల గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు వెల్లడించారు.

తన సినిమా కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే అవకాశాలు తనకి వచ్చాయని తెలిపారు. అయితే తన తల్లిదండ్రుల కారణంగానే ఆ అవకాశాలను కోల్పోయానని ఈమె తెలియజేశారు. మా తల్లిదండ్రులు రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి ఏమాత్రం ఇష్టపడరు అందుకే ముద్దు సన్నివేశాలు ఉన్నటువంటి సినిమా అవకాశాలు వస్తే వద్దని నిర్మొహమాటంగా చెప్పేసేవారు.

ఇలా తన తల్లిదండ్రుల కారణంగా ఎన్నో సూపర్ హిట్ సినిమా అవకాశాలను తాను కోల్పోయానని మృణాల్ ఠాకూర్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి తాను సిద్ధమేనని తెలిపారు. అయితే కథ డిమాండ్ చేసినప్పుడు ఆ సన్నివేశాలకు ప్రాధాన్యత అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సన్నివేశాలలో నటిస్తానని ఈమె తెలిపారు. ఈ విషయంలో తన తల్లిదండ్రులను కూడా తాను కన్విన్స్ చేసినట్లు మృణాల్ ఠాగూర్ వెల్లడించారు. ఇలా తన కెరియర్ గురించి ఈమె చేసినటువంటి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read More: ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా వేణు స్వామి బయోపిక్ చిత్రమా.. వేణు స్వామి కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు