చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు మరో పెద్ద సమస్య వచ్చిందిగా.. ఇప్పట్లో విడుదల కష్టమే?

April 17, 2024

చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు మరో పెద్ద సమస్య వచ్చిందిగా.. ఇప్పట్లో విడుదల కష్టమే?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన చెర్రీ ఈ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా నడుపుతున్నారు. అయితే మూడేళ్ళ నుంచి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథని అందిస్తున్నారు.

ఇకపోతే ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ సాంగ్ అని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పాటతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేదానిపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. గతంలో ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్ రాజు చెప్పగా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా గేమ్ ఛేంజర్ అప్డేట్, రిలీజ్ డేట్ గురించి తనను అడగొద్దని దిల్ రాజు తెలిపారు. సినిమాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం శంకర్ కు మాత్రమే ఉందని తెలిపారు.

ఆయనే రిలీజ్ డేట్ తో పాటు ప్రమోషన్ల గురించి చెబుతున్నారని అన్నారు. ఇక రామ్ చరణ్ ఇటీవల చెన్నైలో గేమ్ ఛేంజర్ మూవీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ చివర్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. తాను ఫస్ట్ టైమ్ పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నానని, మొత్తం ఐదు భాషల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. దీంతో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ ఓజీ, అక్టోబర్ లో దసరా కానుకగా జూనియర్ ఎన్టీఆర్ దేవర విడుదల కానున్నాయి. దీంతో గేమ్ ఛేంజర్.. అక్టోబర్ చివర్లో దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టియాన్ మూవీ కూడా అప్పుడే రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అలా అయితే గేమ్ ఛేంజర్ కు గట్టి పోటీ ఎదురవుతుంది. వెట్టియాన్ డేట్ ఫిక్స్ అయితే.. గేమ్ ఛేంజర్ మూవీని రామ్ చరణ్ చెప్పినట్లే అక్టోబరు చివర్లో రిలీజ్ చేస్తారో లేక డిసెంబర్ కు మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారో అనేది వేచి చూడాలి.

Read More: డైరెక్టర్ శంకర్ కూతురి వివాహ విందు కార్యక్రమంలో డాన్స్ ఇరగదీసిన రణ్‌వీర్‌ సింగ్?

ట్రెండింగ్ వార్తలు