ట్రోలింగ్స్ పై స్పందించిన హీరోయిన్ చాందిని చౌదరి.. నాకు గర్వంగా ఉందంటూ!

April 30, 2024

ట్రోలింగ్స్ పై స్పందించిన హీరోయిన్ చాందిని చౌదరి.. నాకు గర్వంగా ఉందంటూ!

చాందినీ చౌదరి.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కలర్ ఫోటో. సుహాస్ హీరోగా నటించిన ఈ మూవీ విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా యూత్ కి తెగ చేసింది. ఈ సినిమాతో చాందిని చౌదరి క్రేజ్ మరింత పెరిగింది. కాగా చాందినీ చౌదరి తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా కొనసాగుతూనే ఉంది. మంచి పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది.

కాగా ఇటీవల ఆమె నటించిన గామీ మంచి విజయాం సాధించింది. థియేటర్లో, ఓటీటీలో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు కలర్ ఫోటో మూవీతో అందరినీ ఏడిపించేసింది. ఇక యేవమ్, మ్యూజిక్ షాపు మూర్తి అంటూ ప్రయోగాలు చేస్తోంది. మ్యూజిక్ షాపు మూర్తి ప్రమోషన్స్‌లో భాగంగా చాందినీ చౌదరి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఏ ఐపీఎల్ టీంను సపోర్ట్ చేస్తారు అని అడిగిన ప్రశ్నకు, ఆ అడిగిన వ్యక్తికి కౌంటర్ ఇచ్చే ఉద్దేశంలో కాస్త వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది చాందినీ చౌదరి.

తాను ఎక్కువగా క్రికెట్ చూడనని చెప్పింది చాందినీ చౌదరి. అయితే తనది ఏపీ అని, తమ రాష్ట్రానికి టీం లేదు కదా? ఉంటే దానికే సపోర్ట్ చేసే దాన్ని అంటూ చాందినీ చౌదరి తెలిపింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారి తీసాయి. అయితే చాందిని పై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ట్రోల్లింగ్ చేయడంతో తాజాగా ఆమె స్పందించండి. నేను మనకి కూడా ఒక టీం ఉంటే బాగుంటుందనే ఉద్దేశం అలా అన్నాను. కానీ ట్రెండింగ్ కోసం కొంత మంది ఇలా కట్ చేసి ఎడిట్ చేసి వేసుకుంటున్నారు. వాళ్లకి నచ్చినట్టుగా ఆ వీడియోని మార్చుకుంటున్నారు.. నేను మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాన్ని, మన రెండు తెలుగు రాష్ట్రాలంటే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మన ఎస్ఆర్‌హెచ్ టీంకు ఆల్ ది బెస్ట్ అని చాందినీ క్లారిటీ ఇస్తూ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

Read More: భారీ ధరకు అమ్ముడైన తండేల్ డిజిటల్ రైట్స్.. ఈ సారి హిట్ గ్యారెంటి అంటూ?

ట్రెండింగ్ వార్తలు