డబ్బు కోసం నేను పెళ్లి చేసుకోలేదు.. రెండో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తప్పేంటి: వరలక్ష్మి

April 30, 2024

డబ్బు కోసం నేను పెళ్లి చేసుకోలేదు.. రెండో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తప్పేంటి: వరలక్ష్మి

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రముఖ సినీ నటుడి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె కెరియర్ మొదట్లో హీరోయిన్గా పలు తమిళ సినిమాలలో నటించారు. అయితే హీరోయిన్ గా వరలక్ష్మి పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో అనంతరం ఈమె విలన్ పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈమె నటించిన శబరి అనే లేడీ ఓరియంటెడ్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మే మూడవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైనటువంటి విషయాలను కూడా వెల్లడించారు.

ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈయనకు ఇది వరకే పెళ్లి జరిగి ఉంది. అయితే పెళ్లి అయినటువంటి వ్యక్తిని ఈమె రెండో పెళ్లి చేసుకోవడంతో ఎంతోమంది వివిధ రకాలుగా ట్రోల్ చేశారు. అంతగా ఏం నచ్చాడని ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నావు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఆయన వద్ద ఉన్న డబ్బు చూసే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ కామెంట్ లు చేశారు.

ఈ కామెంట్ల గురించి వరలక్ష్మీ మాట్లాడుతూ డబ్బు కోసమే నేను పెళ్లి చేసుకుంటానని మాట్లాడారు. అయితే ఆయన వద్ద ఉన్నంత డబ్బు నా దగ్గర ఉంది. డబ్బు కోసమే అయితే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటూ ఈమె మాట్లాడారు. ఇక ఆయన నాకు ఎలా నచ్చారనేది నా కళ్ళను అడిగితే చెబుతాయి అంటూ ఈ సందర్భంగా వరలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: నాన్న చనిపోయిన తర్వాత జీవితమే మారిపోయింది.. అల్లరి నరేష్ ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు