నాన్న చనిపోయిన తర్వాత జీవితమే మారిపోయింది.. అల్లరి నరేష్ ఎమోషనల్ కామెంట్స్!

April 30, 2024

నాన్న చనిపోయిన తర్వాత జీవితమే మారిపోయింది.. అల్లరి నరేష్ ఎమోషనల్ కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దివంగత దర్శకుడు ఈ వివి సత్యనారాయణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి విజయాలను సొంతం చేసుకున్నారు.

ఇలా దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈవీవీ గారు తన ఇద్దరు కుమారులు రాజేష్ నరేష్ ఇద్దరినీ కూడా ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేశారు. అయితే ఈయన బ్రతికున్నంత కాలం ఇద్దరికీ వరుస సినిమా అవకాశాలు వచ్చాయి కానీ ఈవీవీ గారు మరణించిన తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాలేదని చెప్పాలి.

ఇకపోతే ఇటీవల కాలంలో నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. త్వరలోనే ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

నాన్న మాతో చాలా స్నేహంగా ఉండేవారు మేమేం చేసిన ఆయనతో అన్ని విషయాలు పంచుకొనేవాళ్ళం. తప్పు చేసినా కూడా నాన్నకు చెప్పే స్వేచ్ఛ మాకు కల్పించారు. ఇక అమ్మ కూడా మా సినిమాలు చూసి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూ ఉండేవారని వెల్లడించారు.

ఇకపోతే నాన్న చనిపోయిన తర్వాత పూర్తిగా నా జీవితమే మారిపోయిందని తెలిపారు. ఒక ఏడాది పాటు పూర్తిగా సైలెంట్ అయ్యానని నరేష్ తెలిపారు నాన్న మరణించడంతో ఎన్నో బాధ్యతలు మాపై పడ్డాయి. ఆ బాధ్యతలను నిర్వర్తించే సమయంలో మేము ఎంతో మెచ్యూరిటీ కూడా సంపాదించుకున్నాము అంటూ ఈ సందర్భంగా తన తండ్రి మరణం గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ముద్దు సీన్ల కారణంగానే అవకాశాలు కోల్పోయాను.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు