ఆ టాలీవుడ్ హీరో అంటే మెగా కోడలికి అంత కోపమా.. కనిపించిన పలకరించదా?

February 26, 2024

ఆ టాలీవుడ్ హీరో అంటే మెగా కోడలికి అంత కోపమా.. కనిపించిన పలకరించదా?

మెగా కోడలుగా ఉపాసన అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ బిజినెస్ రంగంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి మెగా ఇంటికోడలుగా అడుగుపెట్టినటువంటి ఉపాసన తన మంచితనంతో మెగా ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడుతూ వచ్చారు.. ఇక ఉపాసన కూడా తెలుగు సినిమాలను బాగానే చూస్తారని తనకు కూడా తెలుగులో ఫేవరెట్ హీరోలు ఉన్నారని ఈమె పలు సందర్భాలలో తెలియజేశారు.

ఇకపోతే ఉపాసనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నచ్చని హీరోలు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోని చూస్తే ఏమాత్రం నచ్చదట ఆయన ఎదురు పడిన కనీసం తనతో మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపారని తెలుస్తోంది. మరి ఉపాసనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నచ్చని హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే..

ఉపాసన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టపడిన హీరో మరెవరో కాదు అఖిల్ అక్కినేని. ఈయన అంటే తనకు చాలా కోపం అట. అఖిల్ పట్ల ఉపాసనకు కోపం రావడానికి కారణం లేకపోలేదు. అఖిల్ గతంలో శ్రియ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించారు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఘనంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల అఖిల్ తనతో బ్రేకప్ చెప్పుకున్నారని మనకు తెలిసిందే.

ఇలా అఖిల్ తన ప్రేయసి శ్రీయా భూపాల్ కు బ్రేకప్ చెప్పిన సమయంలో కూడా ఉపాసన ఇద్దరిని కలిపే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వీరిద్దరూ విడిపోయారు. ఇలా అప్పటినుంచి అఖిల్ అంటే ఉపాసనకు ఏమాత్రం పడదని తెలుస్తోంది. ఇక అఖిల్ రిజెక్ట్ చేసిన శ్రియ భూపాల్ మరెవరో కాదు ఉపాసనకు కజిన్ సిస్టర్ కావడం విశేషం. ఇలా అఖిల్ కారణంగా తన సిస్టర్ జీవితం నాశనమైందన్న ఉద్దేశంతోనే ఉపాసన ఆయనపై కోపం పెంచుకున్నారని అందుకే ఎదురు కనపడిన మాట్లాడరని తెలుస్తుంది.

Read More: ఆత్మల మనోభావాలను అర్థం చేసుకుంటూ.. టీజర్ లాంచ్ వేదిక మార్చేసిన మూవీ టీం!

ట్రెండింగ్ వార్తలు