Pragathi: ప్రగతి ఇంట్లో ప్రత్యేక పూజలు? కారణం అదేనా?

December 28, 2023

Pragathi: ప్రగతి ఇంట్లో ప్రత్యేక పూజలు? కారణం అదేనా?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి(Pragathi)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రగతి ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఇటీవలె ఆమెసీరియల్స్ లోకి అడుగు పెట్టింది. ఇటీవలె స్టార్ మా లో ప్రసారమైన ఊర్వశివో రాక్షసివో అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది ప్రగతి. ఇందులో ఆమె నెగటివ్ పాత్రలో నటిస్తోంది. మొన్నటి వరకు వెండితెరపై నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ప్రగతి ఇప్పుడు బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను మరింత అలరిస్తోంది.

కాగా ప్రగతి తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా తన ఫిట్నెస్ విషయంలో, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక తనపై నెగటివ్ కామెంట్ చేసే వారికి ఎప్పటికప్పుడు తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది ప్రగతి. ఇక అప్పుడప్పుడు తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రగతి (Pragathi)తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తోంది.

పండితులతో కలిసి ఏదో యజ్ఞం నిర్వహిస్తోంది. ఒకవైపు పండితులు మంత్రాలు చదువుతుండగా ఆమె అందులో నెయ్యిని అగ్నికి సమర్పిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రగతి ఆ పూజలు చేయడానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. ఆమె కెరియర్ బాగుండాలి అని ఆ పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోని చూసేయండి

Read More: కలెక్షన్లపై వెనక్కి తగ్గిన హోంభలే… సలార్ వసూళ్లపై అనుమానాలు? 

Related News

ట్రెండింగ్ వార్తలు