కలెక్షన్లపై వెనక్కి తగ్గిన హోంభలే… సలార్ వసూళ్లపై అనుమానాలు?

December 27, 2023

కలెక్షన్లపై వెనక్కి తగ్గిన హోంభలే… సలార్ వసూళ్లపై అనుమానాలు?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన సలార్(Salaar) సినిమా పవన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ కటౌట్ కి అనుగుణంగా భారీ బ్లాక్ బస్టర్ సినిమా పడిందని చెప్పాలి. ఇలా ఈ సినిమా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.

ఇటీవల ఈ సినిమా మూడు రోజులకు ఏకంగా 402 కోట్ల కలెక్షన్స్ సాధించింది అంటూ పోస్టర్ ద్వారా తెలియచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టర్ పై అనుమానాలు ఉన్నాయని ఇది నిజం కాదు అంటూ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ సినిమా అని కూడా వెనక్కి నెట్టి ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతున్నటువంటి తరుణంలో కొందరు షారుక్ ఖాన్ అభిమానులు ఈ కలెక్షన్లపై స్పందిస్తూ చేస్తున్నటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

సలార్(Salaar) సినిమా వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అంటూ విడుదల చేసినటువంటి పోస్టర్ హోం బలే నిర్మాణ సంస్థ నుంచి రాలేదని అది కేవలం సలార్ టీం అధికారక పేజ్ ద్వారా షేర్ చేశారు. అయితే సలార్ సినిమా కలెక్షన్ల గురించి ఈ విధమైనటువంటి పోస్ట్ చేసినటువంటి ఆ పేజ్ షారుఖ్ ఖాన్ అభిమాని పేజ్ కావటం విశేషం అయితే ప్రభాస్ సలార్ సినిమా పై ఉద్దేశపూర్వకంగానే షారుక్ ఖాన్ అభిమానులు ఇలాంటి చెడు ప్రచారం చేస్తున్నారని తెలుస్తుంది.

Read More: అవును నేను కమెడియన్నే.. ఆఫీస్ బాయ్ గా పని చేశా : బండ్ల గణేష్

ట్రెండింగ్ వార్తలు