థియేటర్లకు దూరంగా ప్రేక్షకులు.. ఆ కారణంతోనే సినిమాలు చూడలేదా?

May 9, 2024

థియేటర్లకు దూరంగా ప్రేక్షకులు.. ఆ కారణంతోనే సినిమాలు చూడలేదా?

ఒకప్పుడు ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే అభిమానులు చేసే హంగామా మామూలుగా ఉండేది కాదు. పెద్ద ఎత్తున ఆ సినిమాను అభిమానుల ప్రమోట్ చేసేవారు థియేటర్లను అందంగా ముస్తాబు చేస్తూ ఎంతో సందడి చేసేవారు కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అన్నా కూడా థియేటర్లు మొత్తం ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయి. దీంతో కొన్ని థియేటర్లు మూతపడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి.

ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలకు పూర్తిస్థాయిలో ఆదరణ తగ్గిపోయింది ఒకప్పుడు భారతీయ సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ సినిమాలన్నీ చెప్పుకునేవారు కానీ ప్రస్తుతం మాత్రం అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నప్పటికీ కూడా ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు వెళ్లడం లేదు. అలా థియేటర్లకు రాకపోవడానికి కూడా కారణం లేకపోలేదని చెప్పాలి.

ఒకప్పుడు ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే అందులో ఎంతో అద్భుతమైనటువంటి కంటెంట్ ఉండేది కానీ ఇప్పుడు వందల కోట్లు సినిమా కోసం ఖర్చు చేస్తున్న సినిమాలో కంటెంట్ మాత్రం లేదని చెప్పాలి. సినిమాకు కథ బలం అలాంటిది ఆ కథలోనే కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు కూడా సినిమాలను చూడటానికి ఇష్టపడటం లేదు.

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణ ఉండేది క్రమక్రమంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పూర్తిగా సినిమాలకు రావడమే మానేశారు అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోలు దక్షిణాది సినిమాలను రీమేక్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. కానీ ప్రస్తుతం దర్శకులు వారి సొంత కథలతోనే సినిమాలు చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు..

ఈ విషయం గురించి ముంబైకి చెందినటువంటి జీ 7 మల్టీప్లెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొంటూ.. ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించగలిగే సినిమాలు రాకపోవడం వల్ల కొన్ని మల్టీప్లెక్స్ లలోని ప్రదర్శనలను అలాగే సింగిల్ స్క్రీన్ ప్రదర్శనలను నిలిపివేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఎలక్షన్ హడావిడి సమ్మర్ కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: ఇప్పటికీ నాది వన్ సైడ్ లవ్.. భార్య ప్రేమ పై బన్నీ షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు