April 1, 2022
కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో మాత్రమే కాదు కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్. ఈమెకు ఉన్న క్రేజ్ కూడా అంతా ఇంతా కాదు. 15ఏళ్ళుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగడం అనేది ఈమెకు మాత్రమే చెల్లింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 2020 చివర్లో ఈమె తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్ళైనప్పటికీ ఈమె సినిమాలను మానెయ్యలేదు. అయితే ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. దాంతో ఈమెకు నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలో నటించే అవకాశం మిస్ అయ్యింది. పెళ్ళి చేసుకుని ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లకి పెద్దగా అవకాశాలు రావు.. వాళ్ళకు సంపాదన కూడా ఉండదు అని అందరూ అనుకోవడం సహజం. అయితే కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రెగ్నెన్సీ టైములో కూడా ఫుల్లుగా సంపాదిస్తుంది. అదెలా అంటారా?
కాజల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 21 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన బేబీ బంప్ తోనే రకరకాల ఫోటోషూట్లు చేస్తూ ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది. అంతే కాదు, గర్భవతులకు ఉపయోగపడే బ్రాండ్స్ వంటి వాటిని కూడా ఈమె ప్రోమోట్ చేస్తుంది. కాబట్టి ఆ బ్రాండ్స్ కు సంబంధించిన వారు ఈమెకు పారితోషికం గట్టిగానే ఇస్తారు. అంతేకాదు ఫ్రీ డెలివరీ కోసం ఈమె జిమ్ లో చేసే కసరత్తులు వంటివి కూడా హైలెట్ గా నిలుస్తున్నాయి. అవి కూడా హాస్పిటల్ యాజమాన్యాలు చేయిస్తాయట. వాళ్ళు కూడా కాజల్ కు రివర్స్ లో పేమెంట్ చేస్తారు అని స్పష్టమవుతుంది.