ఆచార్య సినిమాలో కాజ‌ల్ లేన‌ట్లేనా?

April 25, 2022

ఆచార్య సినిమాలో కాజ‌ల్ లేన‌ట్లేనా?

Kajal Aggarwal: చిరంజీవితో ‘ఆచార్య’ ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేసిన సమయంలోనే.. కాజల్ హీరోయిన్ అని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత చిరు-కాజల్‌ కాంబోలో సినిమా అనే సరికి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. ‘ఆచార్య’ షూట్‌లో కాజల్‌ పాల్గొన్న ఫొటోలు, ‘లాహే లాహే’ సాంగ్‌లో సంగీతతో కలిసి కాజల్‌ డ్యాన్స్‌ చేసిన పలు వీడియోలు గతంలో బయటకు వచ్చాయి.

అయితే, తాజాగా విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌లలో కాజల్‌ ఎక్కడా కనిపించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లోనూ ఆమె పేరు వినిపించ లేదు. ఈ విషయంపై కొరటాల శివ తాజాగా స్పందించారు. ‘ఆచార్య’ నుంచి కాజల్‌ని తొలగించినట్లు తెలిపారు.

‘‘మొదట సినిమా అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్‌ ఉంటే బాగుంటుందనిపించింది. ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్‌ పాత్ర క్రియేట్‌ చేశాం. నాలుగు రోజులు షూట్‌ చేశాం. పాత్ర రాసుకున్నాం, షూట్‌ చేశాం కానీ, ‘ఆచార్య’ పాత్రకు లవ్‌ ఇంట్రస్ట్‌ ఉంటే బాగుంటుందా? లేదా? అనే విషయంపై నాకు సందేహం కలిగింది.

అదే సమయంలో కరోనా రావడంతో కొన్నిరోజులపాటు ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి లవ్‌ ఇంట్రస్ట్‌ పెడితే బాగోదని, సినిమాలో హీరోయిన్‌ పాత్ర ఉండాలి కాబట్టి ఏదో ఒక పాత్రను సృష్టించి అంత పెద్ద హీరోయిన్‌తో చేయిస్తే బాగోదనిపించింది. అలాగే ఆ పాత్రకు పాటలు కూడా లేవు, సరైన ముగింపు కూడా లేదు.. ఇవన్నీ ఆలోచించి ఓసారి చిరంజీవితో ఇదే విషయాన్ని చెప్పాను.

‘కథకు ఏది అవసరమో అదే చెయ్‌. నీకున్న సందేహాన్ని అందరితో పంచుకో’ అని చిరు చెప్పారు. అదే విషయాన్ని కాజల్‌కి అర్థమయ్యేలా చెప్పాను. ఆమె అర్థం చేసుకుని.. ‘నేను మీ అందర్నీ మిస్‌ అవుతున్నా. భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేద్దాం’ అని చెప్పారు. అలా, ఆమెను ఈ చిత్రం నుంచి తొలగించాం’’ కొరటాల శివ వివరించారు. అయితే, ‘లాహే లాహే’ సాంగ్‌లో కాజల్‌ కనిపిస్తారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని శివ అన్నారు.

ఇంకా చ‌ద‌వండి: ఆచార్య సినిమాకి బ‌జ్ రాక‌పోవ‌డానికి ఈ విష‌యాలే కార‌ణ‌మా?

ట్రెండింగ్ వార్తలు