కల్యాణ్‌రామ్‌ వర్సెస్‌ సత్యదేవ్‌ వర్సెస్‌ దుల్కర్‌ సల్మాన్‌

July 4, 2022

కల్యాణ్‌రామ్‌ వర్సెస్‌ సత్యదేవ్‌ వర్సెస్‌ దుల్కర్‌ సల్మాన్‌

అవును..బాక్సాఫీస్‌ వసూళ్ల కోసం సత్యదేవ్, కల్యాణ్‌ రామ్,దుల్కర్‌ సల్మాన్‌ ఒకే రోజు పోటీ పడుతున్నారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ‘బింబిసార’ సినిమా ఆగస్టు 5న రిలీజ్‌ కానుంది. ఇదే రోజు దుల్కర్‌సల్మాన్‌ హీరోగా నటించిన సీతారామం రిలీజ్‌కు రెడీ అయ్యింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇది. అలాగే ఆగస్టు 5న ఎప్పట్నుంచో వాయిదాలు మీద వాయిదాలు పడుతున్న ‘గుర్తుందా..శీతాకాలం’ సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే బింబిసార టైమ్‌ ట్రావెల్‌ మూవీ కాగా, దుల్కర్‌సల్మాన్‌ ‘సీతారామం’ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ, సత్యదేవ్‌ది ఒకే వ్యక్తికి చెందిన లవ్‌స్టోరీ. సో..మరి ఆగస్టు 5న విడుదల కానున్న ఈ సినిమాల్లో ఏ సినిమాను ప్రేక్షకులు హిట్‌ చేస్తారో చూడాలంటే మరి కొంత సమయం ఆగకతప్పదు మరి

ట్రెండింగ్ వార్తలు