కళ్యాణ్‌రామ్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ అదిరిపోయిందిగా..!

July 4, 2022

కళ్యాణ్‌రామ్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ అదిరిపోయిందిగా..!

నటుడు– నిర్మాత కళ్యాణ్‌రామ్‌ ప్రజెంట్‌ ‘బింబిసార’ అనే సినిమా చేశారు. ఈ సినిమాలో వశిష్ఠ్‌ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. కె. హరికృష్ణ నిర్మించిన బింబిసార చిత్రం ఆగస్టు 5న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. అయితే తాజాగా జూలై 5న కళ్యాణ్‌రామ్‌ బర్త్‌ డే సందర్భంగా ‘బింబిసార’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. టైమ్‌ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఎప్పట్నుంచో ఓ మాంచి హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న కళ్యాణ్‌రామ్‌కు బింబి సార చిత్రం హిట్‌ ఇస్తుందనే నమ్ముతున్నారు నందమూరి ఫ్యాన్స్‌. ఇటు కళ్యాణ్‌రామ్‌ బర్త్‌ డే సందర్భంగా స్టఫ్‌ ఉన్న బింబిసార ట్రైలర్‌ రిలీజ్‌ కావడం కూడా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, క్యాథరీన్‌ హీరోయిన్స్‌గా నటించారు. చిరంతన్‌భట్‌ సంగీతం అందించిన ఈ సినిమాకు ప్రముఖసీనియర్‌ సంగీత దర్శకులు ఎమ్‌ఎమ్‌ కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తుండటం విశేషం.

హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘ రెండున్నరేళ్ల తర్వాత అందరినీ కలుస్తున్నాను. ఎన్నో చంద‌మామ క‌థ‌లు విన్నాం. చ‌దివాం.. కొన్ని చూశాం. కొన్ని తాత‌య్య‌, నాన్న‌మ్మ‌, అమ్మ‌మ్మ‌లు కొన్ని క‌థ‌ల‌ను చెబితే, కొన్నింటిని మ‌నం పుస్త‌కాల్లో చ‌దివాం. కొన్నింటిని మ‌నం వెండితెర‌పై చూసుంటాం. తాత‌గారు చేసిన పాతాళ భైర‌వి, గులేబ‌కావళి క‌థ‌, జ‌గ‌దేవీరుని క‌థ‌, బాబాయ్ చేసిన భైర‌వ ద్వీపం, త‌ర్వాత వ‌చ్చిన ఆదిత్య 369.. త‌ర్వాత చిరంజీవిగారు చేసిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి, మా జ‌న‌రేష‌న్‌లో త‌మ్ముడు చేసిన య‌మ‌దొంగ‌, రామ్ చ‌ర‌ణ్ చేసిన మ‌గ‌ధీర‌, రీసెంట్‌గా వ‌చ్చిన ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాలు గ‌మ‌నిస్తే.. అన్ని అంద‌మైన సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అలాంటి అంద‌మైన గొప్ప చంద‌మామ క‌థ‌ను ఆగ‌స్ట్ 5న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదే బింబిసార‌. ఆ సినిమాల‌ను ఆద‌రించిన‌ట్లే ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆశిస్తున్నాను. టీజ‌ర్‌, ట్రైల‌ర్ మీకు న‌చ్చే ఉంటాయ‌ని అనుకుంటున్నాను. మా సినిమా కోసం ప‌నిచేసిన తోటి న‌టీన‌టుల‌కు చాలా థాంక్స్‌. అంద‌రూ ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో మ‌ళ్లీ మ‌రోసారి మాట్లాడుతాను. ఈ ఏడాది మా తాత‌గారు స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌గారి వంద‌వ పుట్టిన రోజు సంవ‌త్స‌రంగా వ‌న్ అండ్ ఓన్లీ లెజెండ్ అయిన ఆయ‌కు మా బింబిసార సినిమాను డేడికేట్ చేస్తున్నాను’’ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు