January 6, 2022
KarthiNaaPeruShiva2: 2014లో సెప్టెంబరులో కార్తి హీరోగా తమిళంలో ‘మద్రాసు’ సినిమా చేశారు. రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’ సినిమాలకు దర్శకత్వం వహించక ముందు పా.రంజిత్ తీసిన సినిమాయే ‘మద్రాసు’. ఈ సినిమాను తెలుగులో ‘నా పేరు శివ 2’ గా జనవరి 13న విడుదల చేస్తున్నామని ఇటీవల ప్రకటించారు..
ReadMore:ఆర్‌ఆర్‌ఆర్ ఇంట్రవెల్ సీన్ ఎన్ని రోజులు తీశారో తెలుసా!2010లో కార్తి హీరోగా వచ్చిన తమిళం చిత్రం ‘నాన్ మహాన్ అల్లా’ తెలుగులో ‘నా పేరు శివ’గా అనువాదమై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. దీంతో తమిళం మద్రాసు చిత్రానికి ‘నా పేరు శివ 2’ అని టైటిల్ పెట్టి ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నారు. అంతా..బాగానే ఉంది కానీ…తెలుగులో సంక్రాంతి హడావిడి ఎక్కువగా ఉన్న ఈ సమయంలో పని కట్టుకుని మరీ కార్తి పాత సినిమాను విడుదల చేయడం వెనక ఉన్న కారణం ఏంటో మరి?