టిల్లుతో రొమాన్స్ చేయటానికి సిద్ధమైన బుట్ట బొమ్మ పూజా హెగ్డే?

May 2, 2024

టిల్లుతో రొమాన్స్ చేయటానికి సిద్ధమైన బుట్ట బొమ్మ పూజా హెగ్డే?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. సిద్దు జొన్నలగడ్డ ఇదివరకు ఎన్నో సినిమాలలో నటించిన రాణి గుర్తింపు డిజె టిల్లు సినిమా ద్వారా వచ్చిందని చెప్పాలి.. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది ఈ సినిమాలో ఇక ఈయనకి జోడిగా నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించారు.

టిల్లు స్క్వేర్ అనే పేరిట ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవడంతో మూడో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాకు టిల్లు క్యూబ్ అంటూ టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే టిల్లు స్క్వేర్ సినిమాకి కూడా హీరో సిద్దు జొన్నలగడ్డ కథ మొత్తం సిద్ధం చేశారు. అయితే టిల్లు క్యూబ్ సినిమా కథను సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం సిద్దు ఉన్నారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ కాకుండా మరో కొత్త హీరోయిన్ ని తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి నేపథ్యంలో పూజా హెగ్డే ఎంపిక చేయాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా ఏ విధమైనటువంటి సినిమా అవకాశాలు లేకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి పూజా హెగ్డే టిల్లు క్యూబ్ సినిమాలో అవకాశం అందుకున్నారు అంటే నిజంగా ఇది ఆమెకు లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలి అంటే మేకర్స్ ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read More: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సుకుమార్ డాటర్ సుకృతి!

ట్రెండింగ్ వార్తలు