May 2, 2024
మెగా హీరోలు అందరూ వరుసగా పిఠాపురం క్యూ కడుతున్నారు. జనసేన అధినేత మెగా హీరో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీకి నిలబడటంతో ఎలాగైనా ఆయనని గెలిపించుకోవాలని ఫ్యామిలీ సిద్ధమైంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు అదేవిధంగా జబర్దస్త్ టీం తో పాటు సిరి సెలబ్రిటీలో కూడా ఇక్కడ పర్యటనలు చేస్తూ జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఇక నాగబాబు ఆయన సతీమణి అలాగే కుమారుడు వరుణ్ తేజ్ కూడా ఇప్పటికే పిఠాపురంలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే.
వరుణ్ తేజ్ పిఠాపురం ప్రచార కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అయితే వరుణ్ తేజ్ తర్వాత మరో మెగా హీరో పిఠాపురంలో పర్యటించి జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. మెగా హీరో వైష్ణవ తేజ్ తన మావయ్య కోసం పిఠాపురం చేరుకొని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఈయనను చూడటానికి ఆయనతో సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడ్డారు.
ఇలా మెగా హీరోలందరూ ఒక్కొక్కరుగా పిఠాపురం చేరుకోవడమేకాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు అయితే మే ఐదవ తేదీ మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. మే ఐదవ తేదీ నుంచి 11వ తేదీ వరకు చిరంజీవి పిఠాపురంలో జనసేన పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం తన భార్య సురేఖతో కలిసి దుబాయ్ వెళ్లినటువంటి చిరంజీవి త్వరలోనే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే ఈయన పిఠాపురంలో పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
Read More: ఆ టాలీవుడ్ హీరోతో పని చేయాలని ఉంది.. కోరికను బయటపెట్టిన అల్లరి నరేష్!