December 4, 2021
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ’డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుంది. ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` డిజిటల్ రైట్స్‌ని `సోనిలివ్` సంస్థ ఫ్యాన్సీ మొత్తానికి దక్కించుకుంది. అతి త్వరలో ఈ చిత్రం సోనిలివ్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా..
చిత్ర నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు దాట్ల – “మా ఫస్ట్ మూవీకి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. ఓటీటీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్. సోనివంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. ఈ సినిమా సోనిలివ్ ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహన్‌గారి మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుంది.“ అన్నారు.