ఆనంద్ దేవ‌ర‌కొండ‌ `హైవే` కాన్సెప్ట్ పోస్ట‌ర్స్‌ చూశారా..?

December 2, 2021

ఆనంద్ దేవ‌ర‌కొండ‌ `హైవే` కాన్సెప్ట్ పోస్ట‌ర్స్‌ చూశారా..?

ఇటీవ‌ల పుష్ప‌క విమానం సినిమాతో మంచి విజ‌యం సాధించారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ. ఆయ‌న హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. భారీ అంఛ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌లో ఉన్నాయి. మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

చిత్ర నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ – ‘‘118 వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన గుహ‌న్ గారి ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ, మాన‌స రాధా కృష్ణ‌న్ హీరో హీరోయిన్లుగా హైవే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్ట‌ర్స్ అభిషేక్ బెన‌ర్జి, స‌యామీఖేర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మా బ్యాన‌ర్లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెర‌కెక్కించాం. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు చివ‌రిదశ‌లో ఉన్నాయి“ అన్నారు.

Read More: మొదలైన అఖండ సందడి.. థియేటర్స్ ముందు ర‌చ్చ చేస్తున్న అభిమానులు…

చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ – ‘‘ఒక‌రితో ఒక‌రికి సంభంధం లేని న‌లుగురు వ్య‌క్తుల క‌థే `హైవే’ . పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుంది“ అన్నారు.

తారాగణం: ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, అభిషేక్ బెన‌ర్జి, స‌యామి ఖేర్‌

సాంకేతిక వర్గం: కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్‌ నిర్మాత: వెంకట్‌ తలారి బేనర్‌: శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ స‌మ‌ర్ప‌ణ‌: నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంగీతం: సైమన్‌ కె. కింగ్‌

ట్రెండింగ్ వార్తలు