Lal Salaam Review Telugu: లాల్ సలామ్ రివ్యూ: మరీ ఇంత బోరింగ్ సినిమా ఏంటీ కాంత్?

February 9, 2024

లాల్ సలామ్

లాల్ సలామ్

  • Cast : రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనీల్‌కుమార్, వివేక్ ప్రసన్న, తంగదురై
  • Director : ఐశ్వర్య రజనీకాంత్
  • Producer : సుభాస్కరన్
  • Banner : లైకా ప్రొడక్షన్స్
  • Music : ఏఆర్ రెహమాన్

2 / 5

రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ చాలా రోజుల తర్వాత మెగా ఫోన్ పట్టారు. ఇలా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలలో రజనీకాంత్ గెస్ట్ పాత్రలో నటించినటువంటి ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే..

కథ: కసుమూరు అనే గ్రామంలో గురు (విష్ణు విశాల్) మరియు సంషుద్దీన్ (విక్రాంత్) ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఒక విషాద సంఘటన వారిని దూరం చేయడమే కాకుండా స్నేహితులుగా ఉన్నటువంటి వీరి మధ్య శత్రుత్వం పెరిగిపోయింది. ముంబయికి చెందిన టెక్స్‌టైల్ వ్యాపారి మొయిదీన్ భాయ్ (రజినీకాంత్)కి గురుతో మరియు గ్రామంతో సంబంధాలు ఉన్నాయి. కసుమూరు గ్రామస్థులకు మరో గ్రామం నుండి అవమానాలు ఎదురయ్యే వరకు సినిమా సాఫీగా సాగుతుంది. ఆ తర్వాత సంఘటనలు ఒక్కసారిగా మారిపోతాయి. పరిస్థితి తీవ్రతరం కావడం, మొయిదీన్ భాయ్ ప్రమేయం, యువకులు ఆ సమస్యను తీర్చగలరా? లేదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.

విశ్లేషణ: ఈ సినిమా కథ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇదివరకు ఇలాంటి కథలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సినిమాలో ఎమోషన్ సీన్స్ అంతగా ప్రభావం చూపవు. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోవడం సినిమాకు మరింత మైనస్ గా మారింది. చిన్న స్టోరీ లైన్ తో స్లో పేస్ తో సాగే సినిమా, ముఖ్యంగా సెకండాఫ్ లో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. రజనీకాంత్ గెస్ట్ పాత్రలో నటించారు అని ఎన్నో అంశనాల నడుమ సినిమాకు వెళ్తే ప్రేక్షకులకు తీవ్రమైనటువంటి నిరాశ మాత్రమే ఎదురవుతుంది.

నటీనటుల నటన: విష్ణు విశాల్ పాత్ర ఆకట్టుకుంటుంది. తను చక్కని నటనను ప్రదర్శించాడు. పల్లెటూరి వాతావరణం మరియు మరికొన్ని సన్నివేశాలు చాలా అందంగా చూపించబడ్డాయి. విక్రాంత్ కూడా తన పాత్ర పరిధి వరకు ఎంతో అద్భుతంగా నటించారు ఇక విక్రాంత్ తండ్రి పాత్రలో రజనీకాంత్ నటించిన అద్భుతమైన చెప్పాలి ఇలా ఎవరి పాత్రలకు అనుగుణంగా వారందరూ కూడా మంచిగానే నటించారు.

బాటమ్ లైన్: ఈ సినిమాలోని అందరి పాత్రలు ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కథ మాత్రం సినిమాకు మైనస్ గా మారింది. ఈ సినిమా కథ చాలా రోటీన్ అని ఇదివరకు ఎన్నో సినిమాలు ఇదే కథతో వచ్చాయని చెప్పాలి. సినిమా కథ మొత్తం స్లోగా సాగుతుంది. సినిమాకి కరెక్ట్ రైటింగ్ లేకపోవడం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలని అంతగా ఎలివేట్ చేయకపోవడం తో బోరింగ్ గా అనిపిస్తుంది.

Read More: యాంకరింగ్ పక్కన పెట్టి బిజినెస్ పెట్టిన సుమక్క.. వైరల్ వీడియో!

ట్రెండింగ్ వార్తలు