యాంకరింగ్ పక్కన పెట్టి బిజినెస్ పెట్టిన సుమక్క.. వైరల్ వీడియో!

February 9, 2024

యాంకరింగ్ పక్కన పెట్టి బిజినెస్ పెట్టిన సుమక్క.. వైరల్ వీడియో!

సుమ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై తన మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు. ఒకానొక సమయంలో వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండే సుమ ఇటీవల కాలంలో సినిమా ఈవెంట్లకు పెద్ద ఎత్తున హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర పైన సినిమా ఈవెంట్లు ఇంటర్వ్యూలో అంటూ కెరియర్ పరంగా ఈమె ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా ఈవెంట్లతో బిజీగా గడిపే సుమ ఏమాత్రం విరామం దొరికిన తన టీం తో కలిసి సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో హంగామా చేస్తూ ఉంటారు.

ఇలా ఇప్పటికే తన టీమ్ అందరినీ కూడా సోషల్ మీడియా వేదికగా ఈమె పరిచయం చేశారు వారందరితో కలిసి వివిధ రకాల రీల్స్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈమె పట్ల కామెంట్లు చేస్తున్నారు. నేటిజెన్స్ ఇలా కామెంట్ చేయడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు.

ఈమె తన వద్దకు వచ్చిన కస్టమర్లను నాన్న బుజ్జి అమ్మ అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వారికి వడ్డిస్తూ ఉంటారు విపరీతమైనటువంటి పాపులారిటీని సొంతం చేసుకోవడంతో ఈమె మాట్లాడే మాట తీరుతో ఏకంగా ఒక డీజే సాంగ్ సిద్ధం చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో ఎంతోమంది రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే యాంకర్ సుమ తన టీం తో కలిసి ఈ రీల్ చేశారు అందరికీ వడ్డిస్తూ అమ్మ బుజ్జి కన్నా అంటూనే కుమారి ఆంటీని ఇమిటేట్ చేశారు. మీది 1000 అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ సుమ చెప్పిన డైలాగ్ కూడా వైరల్ గా మారింది ఇలా ఈమె చేసే ఈ కామెడీ రీల్ లో మధ్య మధ్యలో బ్రహ్మాజీని కూడా యాడ్ చేశారు దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏంటి సుమక్క యాంకరింగ్ పక్కనపెట్టి ఈ బిజినెస్ బాగుందని ఇక్కడికి వచ్చావా అంటూ పలువురు ఈ వీడియో పై కామెంట్స్ చేస్తున్నారు.

Read More: Eagle Movie Review: రవితేజ ఈగల్ రివ్యూ అండ్ రేటింగ్!

ట్రెండింగ్ వార్తలు