జిమ్ లో తెగ కష్టపడుతున్న మెగా కోడలు.. మామూలుగా వర్కౌట్స్ చేయలేదుగా?

April 6, 2024

జిమ్ లో తెగ కష్టపడుతున్న మెగా కోడలు.. మామూలుగా వర్కౌట్స్ చేయలేదుగా?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు అనంతరం తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డారు.

వీరిద్దరూ కలిసి రెండు సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే ప్రేమలో పడినటువంటి ఈ జంట రహస్యంగా ఈ ప్రేమ ప్రయాణం చేస్తూ అనంతరం పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి చాలా స్వేచ్ఛ జీవిగా తిరుగుతూ ఉండడమే కాకుండా సినిమాలకు కూడా కమిట్ అవుతూ ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు ఇదిలా ఉండగా తాజాగా ఈమె జిమ్ లో భారీ స్థాయిలో కష్టపడుతూ వర్కౌట్ చేస్తూ కనిపించారు ఈ వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోని లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ వర్కౌట్స్ ప్రారంభించాను అని ..తన పని మళ్లీ కరెక్ట్ గా చేయడానికి…తన బాడీ కంట్రోల్లోకి రావడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టింది అంటూ ఈ వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నేటిజన్స్ యథా విధిగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు వరుణ్ అన్న వదినతో కాస్త జాగ్రత్త అంటూ మరికొందరు ఫన్నీగా ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

Read More: ప్రభాస్ తో ఆ సినిమా చేసి ఇప్పటికీ బాధపడుతున్న అనుష్క.. ఎందుకంటే?

Related News

ట్రెండింగ్ వార్తలు