ప్రభాస్ తో ఆ సినిమా చేసి ఇప్పటికీ బాధపడుతున్న అనుష్క.. ఎందుకంటే?

April 6, 2024

ప్రభాస్ తో ఆ సినిమా చేసి ఇప్పటికీ బాధపడుతున్న అనుష్క.. ఎందుకంటే?

సినీ ఇండస్ట్రీలో కొన్ని జంటలకు ఎంతో మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి జంటలలో ప్రభాస్ అనుష్క జంట ఒకటని చెప్పాలి. ఈ కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే ఆ సినిమా సూపర్ హిట్ అని చెప్పాలి ఈ జోడీకి అంతగా అభిమానులు ఉన్నారు. వీరిద్దరూ కలిసి మొదటిసారి బిల్లా సినిమాలో నటించారు. ఈ సినిమా తరువాత మిర్చి బాహుబలి సినిమాలలో ఈ జోడి కనిపించారు.

అనుష్క ప్రభాస్ ఇద్దరి నటన ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా వీరి మధ్య కెమిస్ట్రీ మంచిగా వర్కౌట్ అవ్వడంతో ఈ కాంబినేషన్లో సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతేకాకుండా వీరిద్దరూ నిజజీవితంలో కూడా ఒక్కటైతే బాగుంటుందని అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. బాహుబలి తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

ఇదిలా ఉండగా తాజాగా అనుష్క ప్రభాస్ జంటకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుష్క ప్రభాస్ తో కలిసి ఒక సినిమాలో నటించి పెద్ద తప్పు చేశానని ఆమె ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారట. మరి అనుష్క అంతగా ఫీల్ అయ్యే ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే ఆ సినిమా మరేదో కాదు బిల్లా.

ఈ సినిమాలో అనుష్క చాలా బోల్డ్ గా కనిపించారు. చివరికి బికినీ కూడా ధరించి కనిపించారు. అనుష్క ఎప్పుడు కూడా ఏ సినిమాలో కూడా ఇలా కనిపించలేదని చెప్పాలి.ఎప్పుడు పద్ధతిగా కనిపించే ఈమెను ఒక్కసారిగా ఇలా బికినిలో చూసేసరికి అందరూ షాక్ అయ్యారు. అయితే అనుష్క ఈ సినిమాకు కమిట్ అయ్యేటప్పటికీ తనకు ఇలా బికినీ సన్నివేశాలు ఉన్నాయని అసలు తెలియదట. సినిమాకు సైన్ చేసిన తర్వాత ఈ విషయాలు తెలిసి ఆమె కూడా షాక్ అయ్యారని తెలుస్తుంది అందుకే ఈ సినిమా విషయంలో ఇప్పటికే అనుష్క బాధపడుతూ ఉంటారు అంటూ ఈ వార్త వైరల్ అవుతుంది.

Read More: అశోక్ గల్లా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. జోడి బాగుందటున్న నెటిజన్స్!

ట్రెండింగ్ వార్తలు