April 6, 2024
చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్ కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా అక్కడ ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఇతర భాషలలో కూడా విడుదలవుతూ వస్తోంది ఇక తెలుగులో నేడు విడుదలైనటువంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..
కథ: కేరళలోని కొచ్చికి చెందిన మంజుమ్మల్ బాయ్స్.. కుట్టన్ (షౌబిన్ షాహిర్), సుభాష్ (శ్రీనాథ్ భాషి) మరియు వీరి మిత్రులందరూ చిన్నచితకా ఉద్యోగాలు చేసుకుంటూ సరదాగా ఉంటారు. అయితే, ఈ మంజుమ్మెల్ బ్యాచ్ కొడైకెనాల్ టూర్ వెళ్లాలని భావిస్తారు. ఇలా అందరూ ప్రయాణం కాగా సుభాష్ కి మాత్రం ఈ ట్రిప్ వెళ్లాలని ఉండదు కానీ కుట్టన్ తనని ఒప్పించి కొడైకెనాల్ వెకేషన్ వెళ్తారు. ఈ నేపథ్యంలో మంజుమ్మెల్ బాయ్స్ అందరూ గుణ కేవ్ అనే లోతైన లోయ ప్రాంతానికి వెళ్తారు. ఆ లోయల్లో పడ్డవాళ్లెవ్వరూ ప్రాణాలతో బయటపడ్డదాఖలాలు లేవు. అందుకే గుణ కేవ్ లోపలికి వెళ్లడాన్ని నిషేదించారు. కానీ, మంజుమ్మెల్ బాయ్స్ మాత్రం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కళ్ళు కప్పి మరి ఈ కేవ్స్ లోపలికి వెళ్తారు. ఇలా వెళ్లడంతో అనుకోకుండా సుభాష్ లోపల ఇరుక్కుపోతాడు ఇలా లోపల ఇరుక్కుపోయిన సుభాష్ ఎలా బయటకు వచ్చారు తన స్నేహితుడు తనని ఎలా కాపాడారు అనేది ఈ సినిమా స్టోరీ.
విశ్లేషణ: ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అని చెప్పాలి సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ఈ సినిమా ఎంతో రియలిస్టిక్ గా ఉంది. అందరూ వెకేషన్ వెళ్లడం అనుకోకుండా గుహలలోకి వెళ్లి లోతైన గుహలలో ఇరుక్కుపోవడం వంటి ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా ఈ సినిమా కథను డైరెక్టర్ ఎంతో అద్భుతంగా మలిచారు. ఈ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది ముఖ్యంగా సుభాష్ లోయలో పడిపోయినప్పుడు తాను బయటకు వస్తాడా రాడా అన్న ఉత్కంఠ గా ప్రతి ఒక్కరిలోను కలుగుతుంది. మొత్తానికి డైరెక్టర్ ఒక చిన్న పాయింట్ తో అద్భుతమైన కథను ప్రేక్షకులకు పరిచయం చేశారని చెప్పాలి.
నటీనటుల నటన: ఈ సినిమాలో నటించినటువంటి కుట్టన్ – సుభాష్ మరియు ప్రధాన పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి వీరందరూ కూడా వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి. సరదా సన్నివేశాలలోను ఎమోషనల్ సన్నివేశాలలో కూడా ఎంతో అద్భుతంగా నటించారు.
తీర్పు: మంజుమ్మల్ బాయ్స్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ లో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి ఆకట్టుకున్నాయి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంది అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను మాత్రం సాగదీసారు అని చెప్పాలి మొత్తానికి ఒక చిన్న సినిమాగా ఆకట్టుకున్నాయి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంది అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను మాత్రం సాగదీసారు అని చెప్పాలి. మొత్తానికి ఒక మంచి సినిమా చూసాము అని అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది.
Read More: Family Star Movie Review Telugu: ది ఫ్యామిలీ స్టార్ రివ్యూ: సెంటిమెంట్సే లేని ఫ్యామిలీ స్టార్!