Mirzapur-3: మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్‌పై క్రేజీ అప్డేట్‌..ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

January 18, 2024

Mirzapur-3: మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్‌పై క్రేజీ అప్డేట్‌..ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని వెబ్ సిరీసులు..జనాల్ని ఓ రేంజులో ఊపేశాయి. అలాంటి వాటిలో ఒకటి మీర్జాపూర్. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చి అత్యంత ప్రేక్షకాద‌ర‌ణ పొంది ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన ఈ వెబ్ సిరీస్‌లో భూతులు, అశ్లీల‌త లాంటి అంశాల‌కేం కొద‌వ లేదు..ఇది హిందీ సిరీస్ అయిన‌ప్ప‌టికీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా ఎక్కేసింది. ఇప్పుడు దీని మూడో సీజన్ నుంచి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది.

మీర్జాపూర్ మూడో సీజన్‌కి సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాది క్రితమే పూర్తయిపోయినప్పటికీ.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు శ‌ర వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలోనే మూడో సీజన్.. ఈ మార్చి చివరి వారంలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మున్నాభయ్యా ఫ్యాన్స్‌కి పండగే. ఇకపోతే తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, అతడి కుటుంబాన్ని మున్నా ఇబ్బంది పెట్టడం చూపించారు. రెండో సీజన్‌లో గుడ్డు భయ్యా.. మున్నా భయ్యాపై ప్రతీకారం తీర్చుకోవడం చూపించారు. మూడో సీజన్‌లో ఏం చూపించబోతున్నారు అన్న‌ది ప్ర‌స్తుతం మిలియ‌న్ డాల‌ర్ క్వ‌చ‌న్‌గా మిగిలింది.

ఓటీటీలో రికార్డులు సృష్టించిన వెబ్ సిరీసుల లిస్టు తీస్తే అందులో కచ్చితంగా ‘మీర్జాపూర్స ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతమైన మీర్జాపూర్‌ నేపథ్యంగా కల్పిత పాత్రలతో ఈ సిరీస్ తీశారు. ఊరమాస్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌లో అద్భుతమైన డ్రామాతో పాటు బూతులు కూడా గట్టిగానే ఉంటాయి. అలా 2018 నవంబరు 16న రిలీజైన తొలి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2020 అక్టోబరు 23న వచ్చిన రెండో సీజన్ అంతకు మించి హిట్‌గా నిలిచింది. మ‌రి మూడో సీజ‌న్ ఎలా ఉండ‌బోతుందో కామెంట్ రూపంలో తెలియ‌జేయండి.

Read More: Saindhav Movie Review: సైంధవ్ మూవీ రివ్యూ!

Related News

ట్రెండింగ్ వార్తలు