Saindhav Movie Review: సైంధవ్ మూవీ రివ్యూ!

January 13, 2024

సైంధవ్

సైంధవ్

  • Cast : వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు.
  • Director : శైలేష్ కొలను
  • Producer : వెంకట్ బోయినపల్లి
  • Banner : నిహారిక ఎంటర్టైన్మెంట్
  • Music : సంతోష్ నారాయణన్

2.5 / 5

హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమాలోశ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ పలువురు కీలక పాత్రలో నటించారు. మరి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది?ఈ సినిమా ఎలా ఉంది అన్న వివరాల్లోకి వెళితే..

కథ:

సైంధవ్‌(వెంకటేష్) తన పాపతో(బేబీ సారా) కలిసి అక్కడి పోర్ట్ లో క్రేన్ ఆపరేటర్ గా పనిచేసుకుంటూ ఉంటాడు. అయితే వీళ్ళ ఇంటి పక్కనే భర్తకు విడాకులు ఇచ్చేసి సింగిల్ గా ఉంటున్న మనో(శ్రద్ధ శ్రీనాధ్) సైంధవ్‌ తో, పాపతో అటాచ్మెంట్ పెంచుకుంటుంది. అనుకోకుండా పాప కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా స్పైనల్ మస్క్యులార్ అట్రోఫీ(SMA) అనే జబ్బు ఉందని తెలుస్తుంది. ఆ జబ్బుని నయం చేయడానికి ఒక్క ఇంజెక్షన్ చాలు, కానీ దాని విలువ 17 కోట్లు. దీంతో పాపని ఎలా బతికించాలా అని బాధపడుతుంటాడు సైంధవ్‌. ఆ సమయంలోనే సైంధవ్ కు ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తున్న పిల్లలకు గన్స్ ఇచ్చి టెర్రరిస్టుల దగ్గరకు పంపించేందుకు భారీగా గన్స్, డ్రగ్స్ షిప్ లో వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడంతో వీటిని పోర్ట్ కస్టమ్ ఆఫీసర్ పట్టుకుంటాడు. అతన్ని చంపి వాటిని తెచ్చుకోవాలని వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్దికీ) ప్రయత్నించగా సైంధవ్‌ అడ్డుపడతాడు. ఆ కంటైనర్ల నంబర్లు మార్చి దాచేస్తాడు. సైంధవ్‌ మళ్ళీ బరిలోకి దిగాడని చంద్రప్రస్థ మాఫియా గ్యాంగ్ అంతా భయపడుతుంది. సైంధవ్‌ ని చూసి అందరూ ఎందుకు భయపడతారు? సైంధవ్‌ గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి? ఇలాంటి విషయాలు అన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్‌, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్‌ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్‌ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిముషాలు ఒకవైపు పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి. ఈ సన్నివేశాలు మొత్తం కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచే ప్రేక్షకులని కూడా ఎమోషన్ చేసి కన్నీళ్లు పెట్టిస్తారు. చివర్లో ఒక లీడ్ ఇచ్చి సైంధవ్‌ మళ్ళీ వస్తాడు అంటూ సీక్వెల్ అనౌన్స్ చేయడం గమనార్హం.

నటీనటులు:

వెంకీమామ నటన గురించి మనందరికీ తెలిసిందే. ఎమోషన్, లవ్, యాక్షన్ అన్ని కంటెంట్స్ తో మెప్పించాడు. ఈ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ లతో మెప్పించాడు. చివర 10 నిముషాలు మాత్రం వెంకటేష్ ఒక పక్క బాధపడుతూనే మరో పక్క యాక్షన్ సీన్స్ లు చేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో వెంకీ మామ నటన ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. శ్రద్ధ శ్రీనాథ్ కూడా బాగానే నటించింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. నటుడు నవాజుద్దీన్ సిద్ధికి విలన్ గా మెప్పించాడు. అతని అసిస్టెంట్ గా, లేడీ విలన్ గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. ఇక తమిళ నటుడు ఆర్య మాత్రం మధ్యమధ్యలో వచ్చి సైంధవ్‌ కి హెల్ప్ చేసి వెళ్లే పాత్రలో పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

బాటమ్ లైన్: యంగ్ స్టర్స్ కి పోటినిస్తూ సక్సెస్ కొట్టిన వెంకటేశ .

Read More: గుంటూరు కారంను తొక్కేసిన హనుమాన్.. మహేష్ బాబు రేంజ్ ఇంతేనా?

ట్రెండింగ్ వార్తలు