మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ

September 7, 2023

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

  • Cast : న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, మురళీ శర్మ, అభినవ్ గోమతం, నాసర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి, భద్రం
  • Director : మహేష్ బాబు పచ్చిగొల్ల
  • Producer : వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
  • Banner : యువి క్రియేషన్స్
  • Music : రాధన్, గోపీ సుందర్

2.75 / 5

హీరో నవీన్ పొలిశెట్టి(Naveen polishetty), హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka shetty) జంటగా వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి( Miss shetty Mr Polishetty). మహేశ్ బాబు(Mahesh babu) అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ నిర్మించింది. జాతిరత్నాలు వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నవీన్‌ పోలిశెట్టి.. చాలా గ్యాప్‌ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మి ఈ సినిమా అభిమానుల అంచ‌నాల‌ను అందుకుందా లేదా ఇప్పుడు చూద్దాం.

కథ (miss shetty mr polishetty story) : అన్విత శెట్టి (అనుష్క) ఒక ఇండిపెండెంట్ వుమెన్‌. యూకేలో షెఫ్‌గా పనిచేస్తుంటుంది. త‌న త‌ల్లి జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల కార‌ణంగా ఆమెకు ప్రేమ‌, వివాహం మీద ఆస‌క్తి ఉండ‌దు. కాని తల్లి మరణం తర్వాత ఒంటరిగా ఫీలవుతుంది. పెళ్లి కాకుండా ఎలాంటి రిలేషన్ షిప్ లేకుండా ఒక బేబి కావాలి అనుకున్న అన్విత‌కి స్టాండప్ కామెడీ చేసే సిద్ధూ పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు…. ఆమెతో ప్రేమలో పడతాడు సిద్ధూ. అయితే పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలని అనుకోవడం సమాజానికి విరుద్ధమని, యాంటీ సోషల్ ఎలిమెంట్ అని తన అభిప్రాయాలు చెబుతాడు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్విత దేశం వదిలి మ‌ళ్లీ యూకే ఎందుకు వెళ్ళింది? అసలు, ఆమె తల్లి అయ్యిందా? లేదా? చివరకు, ఇద్దరూ కలిశారా? లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

త‌న కామెడీ టైమింగ్ తో నవీన్ పోలిశెట్టి మరోమారు పూర్తి సినిమాను తన భుజాల‌పై మోశాడు. క‌న‌ప‌డిన ప్ర‌తీ ఫ్రేమ్‌లోనూ చాలా ఈజ్‌తో న‌టించాడు. కామెడీతోపాటు ఈసారి ఎమోషన్స్ సీన్స్ తోనూ మెప్పించాడు న‌వీన్ పొలిశెట్టి. అనుష్కకు నటిగా పేరు పెట్టాల్సిన పని లేదు. కాకపోతే.. ఆమెను కాస్త సన్నగా చూపించడం కోసం ఫిల్టర్లు, గ్రాఫిక్స్ వాడి ఆమెను సన్నగా చూపించే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా కాంబినేషన్ సీన్స్ లో ఆమె క్లోజప్ షాట్స్ సదరు ఫిల్టర్లు/సీజీ వర్క్ కారణంగా మరీ ఎబ్బెట్టుగా ఉంది. చాన్నాళ్ల తర్వాత హ్యాపిడేస్ సోనియా దీప్తిగా తెరపై కనిపించింది. న‌వీన్ పొలిశెట్టి తండ్రి పాత్రలో మురళీశర్మ, తల్లి పాత్రలో తులసి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. జ‌య‌సుధ ఉన్నంత‌లో ప‌ర్వాలేద‌నిపించింది.

సాంకేతికవర్గం పనితీరు: ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించ‌డం ఆమెను సాధించుకోవడం కోసం నానా తిప్పలు పడడం” అనే రెగ్యులర్ కాన్సెప్ట్ కథకు “ స్పెర్మ్ డోనార్” పాయింట్ యాడ్ చేసి కాస్త కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మహేష్ బాబు. అనుష్క-నవీన్ ల కాంబినేషన్ సెట్ చేసుకోగలగడం, ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ను కథనానికి ముఖ్యాంశంగా వాడుకోవడం వంటివి ఒక ఫిలిమ్ మేకర్ గా అతడికి ఉన్న మెచ్యూర్ ఐడియాలజీని పరిచయం చేసినప్పటికీ.. ఆచరణ రూపంలో మాత్రం కాస్త‌ తడబడ్డాడు. రధన్ పాటలు కానీ, గోపీసుందర్ నేపధ్య సంగీతం కానీ సినిమాకి పాజిటివ్ పాయింట్ గా నిలవలేకపోయాయి. పాటల ప్లేస్ మెంట్ సినిమాకి మైనస్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. యువి ప్రొడక్షన్ వ్యాల్యూస్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్, అనుష్క‌ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కి డబ్బు ధారాళంగా పోశారు అనిపిస్తుంది.

జీవితంలో ప్రతి ఒక్కరికి భాగస్వామి కావాలని, తోడుగా ఓ మనిషి ఉండాలని సందేశం ఇచ్చే సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. అయితే, మెసేజ్ ఇస్తున్న‌ట్లు పతాక సన్నివేశాల వరకు కనిపించదు. కేవలం వినోదం మాత్రమే ముందు సీటులో కూర్చుంటుంది. స్క్రీన్ ముందు కూర్చున్న ప్రేక్షకులను నవ్విస్తుంది. ఎండింగ్ ఎమోషనల్ సీన్లు హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. అసలు కథ, కామెడీ, ఎమోషన్స్ ఇంటర్వెల్ తర్వాతే ఉన్నాయి! మీ టికెట్ రేటుకు సరిపడా ఫన్ గ్యారెంటీ!

Read More: ఈ సారైనా వారిని ఆదుకో.. విజ‌య్‌!

ట్రెండింగ్ వార్తలు