September 5, 2023
ది విజయ్ దేవరకొండ(Vijay Devarakonda).. ఈయనకు కాంట్రవర్సీలు అంటే ఇష్టమో లేక కాంట్రవర్సీలకే ఈయన అంటే ఇష్టమో తెలీదు కాని విజయ్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ తిరుగుతూనే ఉంటుంది. అర్జున్ రెడ్డి(Arjun Reddy), గీత గోవిందం(Geetha Govindam) సినిమాల పుణ్యమా అని స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం తడబడుతున్నాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో విజయ్ చేసిన ఓవర్‌యాక్షన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఔట్ పుట్‌తో అంత కాన్ఫిడెంట్‌గా ఎలా ప్రమోట్ చేశారన్నది సమాధానం లేని ప్రశ్న. ఈ సినిమా విషయంలోనే కాదు తన గత చిత్రాల ప్రమోషన్స్‌లోనూ విజయ్ అత్యుత్సాహం చూపిస్తూనే వచ్చాడు.
ఇప్పుడు విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మిక్స్‌డ్ టాక్ అందుకుంది…కాని కలెక్షన్ల పోస్టర్లు మాత్రం 100కోట్లు దాటేలా ఉన్నాయి.
కొంత మంది కావాలనే తన సినిమా మీద డబ్బులిచ్చి మరీ బుడదజల్లుతున్నారనేది మనోడి వాదన. డబ్బులు ఖర్చు పెట్టి మరీ విజయ్ సినిమా మీద నెగటివ్ రివ్యూలు రాయించేంత అవసరం ఎవరికి వచ్చిందో పాపం. ఇక బుక్‌మైషో రివ్యూల విషయంలోనూ మనోడికి అన్యాయం జరిగిందట. పాజిటివ్ రివ్యూలు మాత్రం పైసా ఖర్చు పెట్టకుండా వారికి వారే రాసేశారట.
ఖుషి కలెక్షన్లు సోమవారం కంటే మంగళవారం భారీగా తగ్గాయన్నది వాస్తవం. విజయ్…నీ సినిమా ఇప్పటివరకూ కేవలం రెండు ఏరియాల్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయేలాగా ఉన్నాయి. లైగర్‌లా రోడ్డున పడకుండా ఈ సారైనా వారిని ఆదుకో..విజయ్
Read More: ఖుషి మూవీ రివ్యూ